రాష్ట్రంలో ఆ మాట వినిపించకుండా చెయ్యండి ... ఇసుకపై సమీక్షలో సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు స్పందన కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వర్షాకాలం కావడంతో ఇసుక విషయంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇసుక కొరత అన్నమాట వినపడకూడదని అధికారులు ఏం చేస్తారో ఎలా చేస్తారో కానీ రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటికే వర్షాలు బాగా పడుతున్నాయి అని, ఇసుక రీచ్ లలోకి నీరు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల్లోగా రాష్ట్రానికి కావాల్సిన ఇసుకను స్టాక్ చేసుకోవాలని సూచించారు. దీనిపై ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని పేర్కొన్న సీఎం జగన్ జాయింట్ కలెక్టర్లు ఇసుక కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. అంతేకాదు నాణ్యమైన ఇసుకను స్టాక్ యార్డ్ లలో స్టాక్ చేయాలని, సరఫరా కూడా పారదర్శకంగా జరగాలని సూచించారు.

CM YS Jagan instructions to avoid sand shortage in ap in this rainy season

నాణ్యమైన ఇసుక పంపిణీ చేయలేకపోతే అధికారులకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. గతంలో లాగా ఇసుక కొరత సమస్య వినిపించ కూడదని గట్టిగా చెప్పారు సీఎం జగన్. కలెక్టర్లు, జేసీలు ఏం చేస్తారో ఎలా చేస్తారో తనకు తెలియదని రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది అనే మాట తనకు వినపడకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉభయగోదావరి, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇసుక బ్యాక్ లాగ్ ను వెంటనే క్లియర్ చేయాలనిచేయాలని కూడా పేర్కొన్నారు. హౌసింగ్, ఆర్ బి కే లు,స్కూల్ భవనాలకు సంబంధించి నాడు-నేడు పనులు ఎక్కడా ఆగకుండా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+