ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త వరాలు - ఐఆర్, రుణమాఫీ, పెన్షన్ పెంపు..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దుల కసరత్తు వేగవంతం చేసారు. ఒకటి రెండు రోజుల్లోనే తుది జాబితా విడుదలకు అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ వైఖరి స్పష్టం కావాల్సి ఉంది. కాంగ్రెస్ ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగించింది. పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో జగన్ ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
జగన్ కొత్త లెక్కలు:ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాు. ప్రతిపక్షాలకు ఏ అంశంలోనూ ఛాన్స్ ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం. ప్రతిపక్షాలు జగన్ టార్గెట్ గా ఎన్నిక బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో జగన్ హామీల విషయంలో ఆచి తచి వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చటం ద్వారా తన విశ్వసనీయత పెంచుకొనే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన చంద్రబాబు, పవన్ ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సంక్షేమం పైన హామీలు ప్రకటించింది. కానీ, ఆశించిన స్థాయిలో ఆ పథకాలకు ప్రచారం..ఆదరణ కనిపించ లేదు. చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని..ఎన్నికల్లో మోసం చేసే హామీలు ఇస్తారని జగన్ ప్రతీ సభలోనూ ప్రచారం చేస్తున్నారు.

రుణమాఫీ, పెన్షన్ పెంపు:2019 ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా జగన్ పెన్షన్ రూ 3 వేలు చేసారు. మరలా అధికారంలోకి వస్తే రూ 4 వేలకు పెంపు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అటు మహిళలకు ఉచిత బస్పు ప్రయాణం పైన ప్రచారం జరుగుతోంది. ఇందులో సాధ్యాసాధ్యాల తో పాటుగా పొరుగు రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను..ఆర్దిక భారం పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. : ఇక, రైతుకు రుణ మాఫీ అంశం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. రైతులకు రుణమాఫీ అంశంలో ఎంత మేర చేయాలి..ఎంత మేర భారం పడుతుంది..ఎంత మేర చేస్తే ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే అంశాల పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులకు ఐఆర్:ఉద్యోగులకు పీఆర్సీ పైన ఇప్పటికే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. నివేదికకు సమయం ఉండటంతో ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు జగన్ 2019లో 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఉద్యోగులకు పలు రకాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫిబ్రవరి రెండో వారంలో వాటిని చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఐఆర్ పైనా నిర్ణయం ఉంటుందని సమాచారం. దీంతో, సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాలకు దగ్గరవుతూనే...ఈ హామీల ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. తాను అమలు చేసిన సంక్షేమం మరోసారి అధికారం అందిస్తుందని భావిస్తున్నారు. దీంతో, జగన్ ఎన్నికల వేళ ఎలాంటి హామీలు ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications