విశాఖకు వైఎస్ జగన్- ఏపీలోనే అతిపెద్ద షాపింగ్ మాల్.. శంకుస్థాపన
అమరావతి: ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోన్న సాగర నగరం విశాఖపట్నంలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పటికే 14,500 కోట్ల రూపాయల వ్యయంతో అదాని డేటా సెంటర్ ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇక తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ విశాఖలో ఏర్పాటు కానుంది.
అదే- ఇనార్బిట్ మాల్. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోతోంది ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. దీనికి సంబంధించి ప్రాథమిక ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మాల్ నిర్మాణ పనులను రహేజా సంస్థ మొదలు పెట్టనుంది.

విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సాలిగ్రామపురంలో దీన్ని నిర్మించనుందా సంస్థ. విశాఖ పోర్ట్‌కు చెందిన గెస్ట్ హౌస్ స్థలంలో దీన్ని నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. శిథిలావస్థకు చేరుకున్న విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. దీనికోసం 125 కోట్ల రూపాయలను వైజాగ్ పోర్ట్‌కు చెల్లించింది.
ఈ భారీ మాల్‌ను మూడు సంవత్సరాల వ్యవధిలో నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్, వసై, నవీ ముంబై, వడోదర.. వంటి నగరాల్లో ఇవి నిర్మతం అయ్యాయి. ఇక తాజాగా విశాఖపట్నం కూడా ఈ జాబితాలో చేరనుంది.
ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్‌కు వైఎస్ జగన్ ఆగస్టు 1వ తేదీన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. సాలిగ్రామపురంలో దీని నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టనున్నారు అధికారులు.
ఇటీవలే కే రహేజా సంస్థ చీఫ్ నీల్ రహేజా.. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. మాల్ శంకుస్థాపనకు రావాలంటూ ఆహ్వానించారు. విశాఖలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్‌ను నిర్మించబోతోన్నామని, దీనికోసం మూడేళ్లలో 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications