ఎగ్జిట్ పోల్స్ పై జగన్ లెక్క ఇలా - వైసీపీకి వచ్చే సీట్లివే..!!

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అధికారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనా ఇంకా స్పస్టత రాలేదు. కానీ, ప్రధాన పార్టీలు మాత్రం ఎవరికి అనుకూలం గా ఉన్న సర్వేను చూసి నమ్మకం పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ పైన పార్టీ ముఖ్యులతో జగన్ స్పందించారు. తన లెక్క ఏంటో జగన్ స్పష్టం చేసారు. అధికారంలోకి రావటంతో పాటుగా పార్టీ గెలిచే సీట్లపైన క్లారిటీ ఇచ్చారు.

ధీమాగా సీఎం జగన్
ఎగ్జిట్ పోల్స్ లో భిన్న అంచనాలు వెల్లడయ్యాయి. జాతీయ స్థాయిలో వెల్లడైన మెజార్టీ సర్వేలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. పార్థా దాస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 110-120, టీడీపీ కూటమికి 55-65 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఇక సీపీఎస్‌ అంచనాల ప్రకారం వైసీకి 97 నుంచి 108 అసెంబ్లీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌కు 0 నుంచి ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక పొలిటికల్‌ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 108 సీట్లు వస్తాయి. కూటమికి 67 అసెంబ్లీ సీట్లు వస్తాయి. ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్స్‌లో వైసీపీ 98 నుంచి 116 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంది. జన్‌మత్‌ అంచనాల ప్రకారం వైసీపీ 95-103 సీట్లు, టీడీపీ 67-75 సీట్లు సాధిస్తాయి. ఆరా సంస్థ వైసీపీకి అధికారం ఖాయమని చెబుతోంది.

CM YS Jagan Reacts over exit polls with party leaders made interesting Analysis

జగన్ అంచనాలు
ఇక,ఎగ్జిట్ పోల్స్ పైన జగన్ పార్టీ ముఖ్యుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా...జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం నమోదు..మహిళల మద్దతు...సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తంఏపీ వైపు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రతిపక్షం గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తన్న అంశం పైన జగన్ ఎలాంటి కామెంట్ చేయలేదని చెబుతున్నారు.

CM YS Jagan Reacts over exit polls with party leaders made interesting Analysis

గెలుపు ఖాయం
జగన్ విదేశాలకు వెళ్లిన తరువాత ఏపీలో రాజకీయంగా చోటు చేసుకున్న అంశాల పైన చర్చ జరిగింది. అధికారుల మార్ప, పిన్నెల్లి పై కేసు, కౌంటింగ్ పైన వస్తున్న సమాచారం గురించి పార్టీ నేతలు జగన్ కు వివరించారు. అయితే, జగన్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాము గెలవటం ఖాయమని..జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ ముఖ్యనేతలు ధీమాగా చెబుతున్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీ కూటమి మాత్రం నేటి ఎగ్జిట్ పోల్స్..జూన్ 4న ఫలితాల్లోనే తమ గెలుపు ఖాయమని వాదిస్తున్నారు. దీంతో..ఎన్నికల ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+