వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దంగా ఉండండి.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి : కరోనాపై అధికారులకు జగన్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీలో అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య అధికారులకు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. అదే సమయంలో ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. కరోనా విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సమాచారం తెలుసుకోవాలని.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్‌పై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ ఈ సూచనలు చేశారు.

భారత్‌ను తాకిన ప్రాణాంతక కరోనా వైరస్..హైదరాబాద్‌లో టెక్కీకి సోకిన మహమ్మారిభారత్‌ను తాకిన ప్రాణాంతక కరోనా వైరస్..హైదరాబాద్‌లో టెక్కీకి సోకిన మహమ్మారి

 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..

కరోనా వైరస్ జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడ పాజిటివ్ కేసు నమోదైనా.. అక్కడి సిబ్బంది దానికి అనుగుణంగా ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి.. దాని నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

 మాస్కులు ఆర్డర్ చేయాలని ఆదేశం..

మాస్కులు ఆర్డర్ చేయాలని ఆదేశం..

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ సచివాలయాలను కేంద్రంగా చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయంలో కరపత్రాలు అంటించడటంతో పాటు.. అక్కడినుంచే ప్రజలకు బాడీ మాస్క్,మౌత్ మాస్కులను అందించాలన్నారు. మాస్కులు ముందుగానే ఆర్డర్ ఇస్తే మంచిదని.. తీరా వైరస్ వ్యాప్తి చెందాక ఆర్డర్ చేస్తే సకాలంలో రావని అన్నారు.

రంగంలోకి రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్..!

రంగంలోకి రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్..!

కరోనా వైరస్‌పై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లకు వివరాలు అందించారు. కేవలం 5 శాతం కరోనా కేసుల్లో మాత్రమే విషమ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఎక్కువగా వయో వృద్దులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోందని చెప్పారు. గతంలో సార్స్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నామని.. అదే స్ఫూర్తితో కరోనాను కూడా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుతో పాటు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా పట్ల ఎలా వ్యవహరించాలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అలాగే రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి.. ఎక్కడ ఎవరిలో కరోనా లక్షణాలు కనిపించినా.. వెంటనే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

Recommended Video

Mukesh Ambani Meets AP CM, Discusses Industrial Devlopment | Oneindia Telugu
తెలంగాణలో కరోనా పాజిటివ్..

తెలంగాణలో కరోనా పాజిటివ్..


సోమవారం తెలంగాణ,ఢిల్లీల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ప్రస్తుతం కరోనా పేషెంట్‌కు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. అటు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ దీనిపై ప్రత్యేకంగా భేటీ అయి చర్చించింది. మొత్తం 8 శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. 24 గంటల పాటు ఈ కాల్ సెంటర్ పని చేసేలా సమర్థంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనాతో మరణాల రేటు తక్కువగానే ఉందని.. కాబట్టి ప్రజల్లో వదంతులు ఏర్పడకుండా జాగ్రత్తపడాలని అధికారులకు సూచించారు.

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan government on Tuesday reviewed preparedness and measures to check the spread of novel Coronavirus (COVID 19) in the wake of a telangana man testing positive for the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X