60 ఏళ్ల కల సాకారం: రూ. 340 కోట్లతో భారీ ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన
నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మక వరకపూడిసెల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని చెన్నకేశవ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
వరికపూడిసెల ప్రాజెక్ట్.. దశాబ్దాల నాటి కల. 60 సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడది కార్యరూపం దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండటం వల్ల జాప్యం ఏర్పడుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లుగా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు.

దీన్ని అడ్డుగా పెట్టుకుని ఈ ప్రాజెక్టును అటకెక్కించలేదు జగన్ సర్కార్. పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఒత్తిడిని తీసుకుని రాగలిగారు. ఫలితంగా ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.వరికపూడిసెల ఎత్తి పోతల తొలి దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు వైఎస్ జగన్. ఈ ప్రాజెక్ట్ తొలిదశ నిర్మాణ పనుల వ్యయం అంచనా 340.26 కోట్ల రూపాయలు. పనులను వేగంగా పూర్తి చేయడం ద్వారా 24,900 ఎకరాలకు సాగునీటిని అందించాలనేది ఆయన సంకల్పం.
నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలో మీటర్ల ఎగువన వరికపూడిసెల వాగు కృష్ణా నదిలో కలవక ముందే.. ఆ నీటిని ఎత్తి పోసి పల్నాడు భూములకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించాలనేది ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ పనులను చేపట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో అది అక్కడితో ఆగిపోయింది.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకంలో మళ్లీ కదలిక వచ్చింది. గోదావరి-కృష్ణా- పెన్నా అనుసంధానం తొలి దశ పనులతోపాటు వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపూడిసెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించేలా డీపీఆర్ రూపొందించారు.

వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను 340.26 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు కిలో మీటర్ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు.
ఈ పైప్ లైన్ నిర్మాణానికి అనుమతులు రాలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అటవీ మంత్రిత్వ శాఖకు బదలాయించింది. దీనికి అవసరమైన నష్ట పరిహారాన్ని కూడా చెల్లించింది. దీనితో దీని నిర్మాణానికి కేంద్రం అనుమతులు జారీ చేసింది.
ఈ ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టుకు సమర్ధవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications