పులివెందుల కేంద్రంగా సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్దులు ఖరారయ్యారు. జగన్ పులివెందుల నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బస్సు యాత్రలో ఉన్న జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు ముమూర్తం ఖరారైంది. బస్సు యాత్రను ఈ నెల 24వ తేదీతో ముగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కార్యాచరణ ఖరారు చేసారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం చేస్తున్న బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 24 తేదీన శ్రీకాకుళంలో యాత్ర ముగియనుంది. ఇదే సమయంలో జగన్ పులివెందుల నుంచి తన నామినేషన్ దాఖలు పైన నిర్ణయం తీసుకున్నారు. పులివెందులలో ఈ నెల 22న ఎంపీ అభ్యర్ది అవినాశ్ రెడ్డి సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 24న శ్రీకాకుళంలో జగన్ బస్సు యాత్ర పూర్తి చేసి అక్కడ నుంచి నేరుగా కడప వెళ్లనున్నారు. 25న పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తరువాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే ఎన్నికల సభల యాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 25వ తేదీ నుంచి రోజుకు మూడు సభల్లో జగన్ ప్రచారం చివరి రోజు వరకు పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ద్వారా మూడు సభలు, అవకాశం ఉన్న రోజుల్లోనాలుగు సభవరకు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ లోగానే జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. మేనిఫెస్టోలోని అంశాలనే ప్రధానంగా తన ఎన్నికల ప్రచారంలో వివరించేలా జగన్ సిద్దం అవుతున్నారు. విపక్ష కూటమితో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జగన్ ప్రచారంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర జరగని నియోజకవర్గాల్లోనూ ప్రచార సభలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. పులివెందులలో జగన్ కు మద్దతుగా భారతి ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications