అవ్వ, తాతలకు జగన్ శుభవార్త: ఎల్లుండి నుంచి ఏపీలో..!!

YS Jagan: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతోంది. మరో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నారు.

ఇందులో భాగంగా- రాష్ట్రంలో మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోన్నారు జగన్. ఇచ్చిన హామీని ఇచ్చినట్టే అమలు చేస్తామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ గతంలో పలు సందర్భాల్లో ప్రకటించిన ఆయన.. ఈ దిశగా మరో కీలక అడుగు ముందుకు వేయనున్నారు.

 CM YS Jagan will visit Kakinada on Jan 3

ఈ క్రమంలో అవ్వ, తాతలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతోన్నారాయన. వైఎస్సార్ పింఛన్ కానుక కింద వారికి అందజేస్తోన్న మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచే కార్యక్రమాన్ని జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికోసం ఈ నెల 3వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.

బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కాకినాడకు చేరుకుంటారు. అక్కడి రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరవుతారు జగన్. వైఎస్ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ బహిరంగ సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాలను పర్యవేక్షించే లేళ్ల అప్పిరెడ్డి ఇప్పటికే రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌ను పరిశీలించారు. వేదిక నిర్మాణం, బహిరంగ సభ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సభలో పాల్గొనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+