కాకినాడలో ఘరానా మోసం: 10 లక్షల ఏటీఎం డబ్బుతో పరార్
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సీఎంఎస్ సంస్ధకు చెందిన దుర్గా భరణికుమార్ అనే ఉద్యోగి రూ. 10 లక్షల డబ్బుతో ఆదివారం ఉదయం పారిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సీఎంఎస్ సంస్థ యాజమాన్యం విధుల్లో భాగంగా దుర్గా భరణికుమార్‌కు ఏటీఎమ్‌లో నగదు పెట్టే బాధ్యతను అప్పగించింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఏటీఎంలో నగదు పెట్టేందుకు అతని చేతికి రూ. 10 లక్షల నగదు అప్పగించింది.
అయితే, అతడు ఏటీఎంలో నగదు పెట్టుకుండా అటునుంచే అటే ఆ డబ్బుతో పారిపోయాడు. దాంతో సీఎంఎస్ సంస్థ యజమాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకుని ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications