కన్నీరు: హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై కాలేజి మేనేజ్‌మెంట్

ప్రభుత్వం, అధికారులు, మీడియా అందరూ కలిసి తమ విద్యార్థులను తిరిగి సురక్షితంగా తీసుకువాలని వెంకటేశ్వర్ రావు అభ్యర్థించారు. న్యూస్ ఛానళ్లలో వచ్చిన వార్తలను చూసి తనకు కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. దీంతో వెంటనే తాను ప్రధాని కార్యాలయంలో పని చేసే కోడె దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. అతను భూటాన్‌లో ఉండటంతో ఇక్కడ ఉన్న మరో వ్యక్తిని సంప్రదించాలని కోరినట్లు చెప్పారు.
తాను ఫోన్ చేసే లోపే దుర్గాప్రసాద్ కేంద్ర ప్రభుత్వ అధికారులను, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని వెంకటేశ్వర్ రావు తెలిపారు. తమకు సహాయం చేయాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. చిన్న వయస్సులో ఉన్న తమ విద్యార్థులకు బదులు.. దేవుడు తనను తీసుకుపోయినా బాగుండేదని కన్నీటి పర్యాంతమయ్యారు.
వార్తా ఛానళ్ల నుంచే ఎక్కువ సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. ఘటనా స్థలానికి తమ కళాశాల లెక్చరర్లను కూడా పంపించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
తమ విద్యార్థి, ఎంపి కవిత కూడా తమ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి సహాయం చేస్తామని చెప్పారని తెలిపారు.
కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యానికి పాల్పడలేదని తెలిపారు. తమ లోపం లేదని అన్నారు. వారు విహారయాత్రకు వెళ్లే ముందు విద్యార్థులకు ఇన్స్యురెన్స్ కూడా చేయించామని చెప్పారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందిస్తామని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకుని తమ బిడ్డలను మా కళాశాలలో చేర్చారని.. ఇప్పుడు వారు ఇలా ప్రమాదంలో చనిపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications