వినాయక వేడుకల్లో దారుణం: యాసిడ్ కలిపిన రంగులు చల్లారు
చిత్తూరు: ఎంతో ఆనందంగా వసంతాలు చల్లుకుని వినాయకచవితి వేడుకలు చేసుకోవాలనుకున్న ఆ గ్రామ ప్రజల్లో విషాదం సంఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలోని ఒడ్డిపల్లి గ్రామంలో వినాయకచవితి సంబరాల్లో భాగంగా ఆదివారం యాసిడ్ కలిపిన వసంతం చల్లుకోవడంతో పది మంది తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం జరిగింది.
పిల్లలు, యువకులు కేరింతలు కొడుతూ ఆనందంగా వసంతాలు చల్లుకుంటున్న సమయంలో ఈ యాసిడ్ ఉన్న బిందెను కూడా ఎత్తి అందరి మీద చల్లారు. దీంతో సుమారు పది మందిపై యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. యాసిడ్ ఉన్న బిందెను పరిశీలించగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణారెడ్డి తీసుకొచ్చిన బిందెగా గ్రామస్థులు గుర్తించారు.

కృష్ణారెడ్డికి, గ్రామస్థులకు గత పదిహేడేళ్లుగా విభేదాలు ఉన్న నేపథ్యంలో గ్రామస్థులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి గ్రామం నుండి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications