pawan kalyan ali comedian comedian ali janasena jana sena telugudesam tdp chandrababu naidu andhra pradesh lok sabha elections 2019 andhra pradesh assembly elections 2019 పవన్ కళ్యాణ్ అలీ కమెడియన్ జనసేన
పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు, అందుకే.. మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే: కమెడియన్ అలీ
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టాలీవుడ్ కమెడియన్ అలీలు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అయితే ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు, గత నెల ఆయన జనసేనానిని కలిసి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రాహ్మణిని లాగి: చంద్రబాబుపై రోజా ఘాటు వ్యాఖ్యలు, రోడ్డుపై రోజా బైక్ డ్రైవింగ్
అంతేకాదు, మంత్రి గంటా శ్రీనివాస రావుతోను భేటీ అయ్యారు. అలీ టీడీపీలోకి వెళ్లడం ఖాయమైందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అలీ ఓ ఇంటర్వ్యూలో జనసేనాని గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదు
తనను జనసేన పార్టీలోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆహ్వానించలేదని అలీ చెప్పారు. ఆయన పార్టీ పెడుతున్న విషయం కూడా చెప్పలేదని అన్నారు. కానీ అతను పార్టీ పెట్టే విషయం తనకు ముందుగానే తెలుసునని చెప్పారు. అయితే ఈ విషయాన్ని జనసేనాని నేరుగా తనతో చెప్పలేదన్నారు. పవన్ పార్టీ పెట్టాక ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్నది లేదన్నారు.

తన సొంత మనుషులను ఇబ్బంది పెట్టరు
పార్టీ పెట్టిన తర్వాత కూడా సహాయం చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ తనను కోరలేదని అలీ చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేయమని కూడా కోరలేదన్నారు. అయితే అలా కోరకపోవడానికి కూడా అలీ కారణం చెప్పారు. పవన్ కళ్యాణ్ వల్ల (రాజకీయపార్టీ కాబట్టి) తనకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో ఆయన తనను ఆహ్వానించి ఉండకపోవచ్చునని, తన సొంత మనుషులను ఆయన ఇబ్బంది పెట్టరని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టినందువల్ల తన వల్ల తన మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ఇతర దగ్గరి వారికి నష్టం జరగకూడదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనను ఆహ్వానించకపోవచ్చునని అలీ కూడా అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ వ్యక్తిని అని తెలుసు.. మంత్రి పదవి ఆఫర్ చేసే పార్టీలోనే
అలీ ఇంకా మాట్లాడాతూ... తనకు ఏ పార్టీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేస్తే అందులో చేరుతానని స్పష్టం చేశారు. తాను టీడీపీకి చెందిన వ్యక్తిని అని జనసేనానికి ఎప్పుడో తెలుసునని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కదా.. నీకు పార్టీ టిక్కెట్ ఇస్తుందా, పోటీ చేస్తున్నావా అని అఫ్పుడప్పుడు జనసేనాని ఆరా తీసేవాడని చెప్పారు. అయినా పార్టీ వేరు, స్నేహం వేరు అన్నారు.