జగన్‌కు ఓటేయాలని ప్రామిస్!: బ్రదర్ అనిల్‌పై ఫిర్యాదు

ఆ సమావేశంలో పాస్టర్లకు డబ్బులు పంచుతున్నారని వారు ఆరోపించారు. చర్చిలకు డబ్బులు ఇస్తామని ఆయన వాగ్ధానం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
కాగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి ఆధారాలు చూపని రూ.85 కోట్ల నగదును సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
సీమాంధ్రలో మే 7వ తేదీన అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల తేదీకి పదిరోజుల ముందుగా ఓటర్లకు స్లిప్పులు ఇస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసిన స్లిప్పుల్లో ఓటరు గుర్తింపు ఫోటో కూడా పొందుపరుస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications