ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మపై ఫిర్యాదు, కారణం ఇదే
విజయవాడ: ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై కృష్ణా జిల్లాలో కేసు నమోదయింది. రెండేళ్ల క్రితం ఓ యువకుడి మృతి కేసులో రాజీ చేస్తానని రూ.లక్ష తీసుకొని ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై కృష్ణా జిల్లా ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో మరియాంబి అనే మహిళ ఫిర్యాదు చేశారు. 2016 అక్టోబర్ నెలలో డెయిరీ ఫాంలో పని చేస్తూ మరియాంబి కుమారుడు మృతి చెందాడు.

డెయిరీ ఫాం యజమాని ఇచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని సుంకర పద్మశ్రీ కాజేశారని మరియాంబి ఆరోపించారు. ఆమె తొలుత గ్రామదర్శినిలో ఎమ్మెల్యే వంశీ దృష్టికి తీసుకు వచ్చారు. అధికారుల సూచనతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications