Gudlavalleru Report: గుడ్లవల్లేరులో జరిగిందిదీ ! తేల్చేసిన సీఈఆర్టీటీ ! ఐజీ వెల్లడి..!

ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టి భారీ ఎత్తున వీడియోలు చిత్రీకరించారన్న వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై బాలికలు వారం రోజుల పాటు ఆందోళన కూడా చేపట్టారు. దీనిపై పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చినా వారి తల్లితండ్రులు సంతృప్తి చెందకపోవడంతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తో సాంకేతిక దర్యాప్తు చేయించారు. ఈ రిపోర్ట్ తాజాగా ప్రభుత్వానికి అందింది.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూములలో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న ఆరోపణలపై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దర్యాప్తులో తేలిన అంశాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామని అశోక్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

computer emergency response team inquiry found no spy cams in gudlavalleru engineering college

కాలేజీలో నమోదైన కేసు దర్యాప్తును ముగ్గురు ఐజీలు జి వి జి అశోక్ కుమార్, ఎం రవి ప్రకాష్, పీహెచ్డీ రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందని అశోక్ వెల్లడించారు.
హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు. వాష్ రూమ్ ల, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదన్నారు.

విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించినట్లు ఐజీ తెలిపారు. విచారణలో కెమెరాలు,కానీ ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదన్నారు. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనీ విచారణలో అందరూ చెప్పారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు వినియోగించాం.... వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్లు, ఒక ట్యాబ్ ను CERT బృంద సభ్యులకు అప్పగించామన్నారు.

విద్యార్థులు ఎవరు భయపడనవసరం లేదని ఐజీ తెలిపారు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదన్నారు. మరో మూడు రోజుల్లో సీఈఆర్టీ టీమ్ నివేదిక వస్తుందన్నారు. ఈ ఘటనపై ఏటువంటి ఆధారాలున్న పోలీసుల దృష్టికి తేవచ్చని తెలిపారు. కళాశాల యజమానియానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు.
విద్యార్థిని విద్యార్థులు వారి వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉన్న లేదా సందేహాలు ఉన్నా ఇద్దరు అధికారుల నంబర్లు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+