బస్సులోంచి తోసేసిన ప్రయాణికుడు: కండక్టర్ మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడితో తలెత్తిన వివాదం కండక్టర్ ప్రాణాలు తీసింది. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నరవాడ వద్ద విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆర్టీసి కండక్టర్ ఐఎన్ రెడ్డికి, ఓ ప్రయాణికుడికి మధ్య బస్సు స్టాప్ విషయంపై వాగ్వాదం చెలరేగింది.
నెల్లూరు నుంచి పామూరుకు వెళ్తున బస్సులో కొంత మంది ప్రయాణికులు జడదేవి బస్టాప్‌లో ఈ బస్సు ఆగతుందా అని అడగ్గా అక్కడ బస్టాప్ లేదని ఐఎన్ రెడ్డి చెప్పాడు. బ్రహ్మయ్య అనే ప్రయాణికుడు ఆ సంభాషణలో జోక్యం చేసుకుని నీకేం తెలుసు.. అక్కడ బస్సు తప్పకుండా ఆగుతుందని చెప్పాడు. దాంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.

ఆవేశానికి లోనైన బ్రహ్మయ్య ఒక్కసారిగా ఐఎన్ రెడ్డిని బస్సులోంచి నెట్టాడు. దాంతో కిందపడిపోయిన పోయిన ఐఎన్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు ప్రకాశం జిల్లా కినిగిరి మండలం చిన్నారికట్ట గ్రామానికి చెందినవాడు.
ప్రయాణికుడు బ్రహ్మయ్య అదే జిల్లా పామూరుకు చెందినవాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications