ఏపీ అసెంబ్లీ 6 రోజులు- మండలి ఒక్క రోజే-బీఏసీల నిర్ణయాల గందరగోళం
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం ఇరుసభలు ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలు చేశారు. అనంతరం సభలు వాయిదా వేసి బీఏసీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సభలు ఎన్నిరోజులు కొనసాగాలనే అంశంలో గందరగోళం ఏర్పడింది ముందు అసెంబ్లీని కేవలం ఇవాళ మాత్రమే నిర్వహించాలని భావించిన ప్రభుత్వం అసెంబ్లీ బీఏసీలో మాత్రం టీడీపీ డిమాండ్ కు సరేనంది. దీంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని ఈ నెల 26 వరకూ ఆరు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మండలిలో మాత్రం ట్విస్ట్ ఎదురైంది.
శాసనమండలి బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్ణయంతో సంబంధం లేకుండా సభ కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుందని ప్రకటించారు. దీంతో గందరగోళం చోటు చేసుకుంది. వాస్తవానికి ప్రతిసారీ సంప్రదాయం ప్రకారం అసెంబ్లీ ఎన్నిరోజులు నడుస్తుందో మండలి కూడా అన్ని రోజులే నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇవాళ అసెంబ్లీ ఈనెల 26 వరకూ ఆరు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా మండలి బీఏసీలో మాత్రం ఒక్కరోజే అని చెప్పడమే ఈ గందరగోళానికి కారణం. దీంతో బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత సభ్యుల అభ్యంతరాలతో మరోసారి బీఏసీ భేటీ నిర్వహిస్తున్నారు.

మండలి సమావేశం ఒక్కరోజు మాత్రమేనని బీఏసీలో ప్రకటించడంతో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు బీఏసీ నుంచి బాయ్ కాట్ చేశారు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకుని మరోసారి మండలి బీఏసీ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మరోసారి బీఏసీ సమావేశం జరుగుతోంది. ఇందులో అసెంబ్లీతో పాటే ఆరు రోజుల పాటు మండలి కూడా నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పటికే మండలిలో విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. ప్రభుత్వం కోరుకున్న విధంగా ఛైర్మన్ వాయిదా తీర్మానాలు తిరస్కరించడంపై విపక్ష టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో పలు ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందంటూ ఆరోపిస్తోంది. దీంతో ఈసారి మండలికి తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి బలం కూడా భారీగా పెరిగింది. దీంతో ఈసారి సమావేశాలు కూడా వాడివేడిగా సాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications