హైద్రాబాద్‌లో ఏపీ కోసం...: రఘువీరా, చిరు నినాదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శుక్రవారం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రఘువీరా ప్రత్యేక పూజలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై అనంతరం కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము కేంద్ర ప్రభుత్వం బిక్షం కోసం ఎదురు చూడటం లేదన్నారు. ఈ రోజు సీమాంధ్రులు కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధించుకుంటారని చెప్పారు. అది మా హక్కు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పదివేల కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు.

తాము చేసేది రాజకీయం కాదన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 20వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ జరుగుతుందని చెప్పారు. 23వ తేదీన తాము చేపట్టిన సంతకాల ప్రతిని ఇస్తామని అన్నారు. ప్రజల మద్దతు కోసమే సంతకాల సేకరణ అన్నారు. హైదరాబాదులోను సంతకాలు సేకరిస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు వేదికగా పోరాడుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రఘువీరా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జేడీ శీలం, కేవీపీ రామచంద్ర రావు తదితరులు అన్నారు. ఈ సందర్భంగా రఘువీరా వారితో ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేయించారు.












Click it and Unblock the Notifications