అన్నీపక్కన పెట్టి: కాంగ్‌పై ధర్మాన: కిరణ్ పార్టీ పెట్టొచ్చు!

Dharmana Prasad Rao
హైదరాబాద్/శ్రీకాకుళం: దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మంగళవారం అన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల గెలుపు ఓటములతో పని లేకుండా, ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయం సాధించగలదో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధపడే విధంగా సిద్ధాంతాలను పక్కన పెట్టి తన భావజాలాన్ని మార్చుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాను దృఢ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

రాజీనామాలు అనేవి ప్రయోజనకరమైనవి కాదని, శాసన సభలో తెలంగాణ బిల్లును మెజార్టీ సభ్యులు తిరస్కరిస్తే కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోకపోయినా తాము న్యాయపోరాటం చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందా? లేదా? అనేది తెలియదన్నారు. సభలో తనతోపాటు మరో పదిహేను మంది సమైక్య రాష్ట్రంపై మాట్లాడేందుకు వీలుగా చర్చ జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

లోక్‌సత్తాను కాంగ్రెసులో కలపండి: సర్వే

లోక్‌సత్తా పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ సూచించారు. అలా చేస్తే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు తన మల్కాజిగిరి ఎంపీ సీటును త్యాగం చేస్తానన్నారు.

బోత్స వ్యాఖ్యలపై గాదె

కాంగ్రెసు నుండి ముప్పై మంది వరకు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు.

కిరణ్ పార్టీ పెట్టవచ్చు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టే ప్రయత్నం చేయవచ్చునని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కిరణ్ కొత్త పార్టీ అంశం చర్చకు వచ్చింది. కిరణ్ కొత్త పార్టీ పెట్టవచ్చునని అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు ఈ పార్టీ ద్వారా కూడా కాంగ్రెసు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవచ్చుననే అంచనాకు వచ్చారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+