కాంగ్రెసు టికెట్లు: లగడపాటి స్థానంలో దేవినేని అవినాష్

Congress finalises 11 MP candidates in Seemandhra
న్యూఢిల్లీ: సీమాంధ్రలో లోక్‌సభకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేస్తూ గురువారం సాయంత్రం ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మిగిలిన స్థానాలకు ఈనెల 7న అభ్యర్థులను ప్రకటన చేయనుంది.

గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ విజయం సాధించిన విజయవాడ స్థానం నుంచి కాంగ్రెసు దేవినేని అవినాష్‌ను పోటీకి దింపుతోంది. సబ్బం హరి స్థానం అనకాపల్లి నుంచి తోట విజయలక్ష్మిని బరిలోకి దింపుతోంది. మిగతా అభ్యర్థులంతా సిట్టింగ్ పార్లమెంటు సభ్యులే.

శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పార్టీ మారుతారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆమె తిరిగి కాంగ్రెసు నుంచి పోటీ చేయనున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి మళ్లీ కాంగ్రెసు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెసు అధిష్టానం విడుదల చేసిన జాబితా ఇలా ఉంది

శ్రీకాకుళం- కిల్లి కృపారాణి, విజయనగరం- బొత్స ఝాన్సీ, అనకాపల్లి- తోట విజయలక్ష్మి, బాపట్ల- పనబాక లక్ష్మి, అరకు- కిషోర్‌ చంద్రదేవ్, కాకినాడ- పల్లంరాజు, నర్సాపురం- బాపిరాజు, విజయవాడ- దేవినేని అవినాష్‌, నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి, తిరుపతి- చింతామోహన్‌, కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+