షర్మిలపై ఫిర్యాదుల వేళ కాంగ్రెస్ హై కమాండ్ అనూహ్య నిర్ణయం, ఇక..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహలు అమలు చేస్తున్నాయి. వైసీపీ సైతం కౌంటర్ రాజకీయం మొదలు పెట్టింది. పలువురు వైసీపీ నేతలు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ పైన ఫోకస్ చేసింది. పీసీసీ చీఫ్ షర్మిల పైన కొందరు నేతలు ఢిల్లీ లీడర్స్ కు ఫిర్యాదు చేసారు. ఈ సమయంలో పార్టీ కోసం ఏపీ కేంద్రంగా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ భవిష్యత్ కు కీలకంగా మారనుంది.
ఏపీ కాంగ్రెస్ లో ఆసక్తి కర రాజకీయం మొదలైంది. పీసీసీ చీఫ్ షర్మిల వ్యవహార శైలి పైన కొందరు పార్టీ నేతలు ఢిల్లీకి ఫిర్యాదు చేసారు. షర్మిల మార్పు ఖాయమనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం సీనియర్లను రంగంలోకి దించింది. ఏపి కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ల ను నియమించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం.. మస్తాన్ వలిలకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు 25 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని నియమించింది. ఏఐసిసి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ షర్మిల, రఘువీరా రెడ్డి, కె రాజు, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు , జేడీ శీలం ,మస్తాన్ వలి, కెవి పి రామచంద్రరావు,చింతా మోహన్ , బాపిరాజు, హర్ష కుమార్, తులసి రెడ్డి, కిల్లి కృపారాణి తో సహ ఇతర నేతలు ఉన్నారు.

అదే విధంగా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత తిరిగి కాంగ్రెస్ బలోపేతం పైన ఫోకస్ చేయాలని పీసీసీ చీఫ్ రష్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయితే, షర్మిల ఆశించిన స్థాయిలో పని చేయటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. పార్టీలో సమన్వయం లోపించిందని ఢిల్లీ నేతలకు కొందరు ఫిర్యాదు చేసారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ పైన కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల మాత్రం తన అన్న జగన్ పైనే రాజకీయ విమర్శలకు ఎక్కువ గా ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. దీంతో, బీసీ మహిళా నేతకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు పార్టీ నాయకత్వం పీఏసీ కమిటీ ఏర్పాటు ద్వారా భవిష్యత్ లో పార్టీ బలోపేతం లక్ష్యంగా బిగ్ టాస్క్ అప్పగించింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications