కృష్ణా జిల్లాలో మరింత బలోపేతం: టీడీపీలోకి దేవినేని నెహ్రూ, వేదవ్యాస్‌?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేవనుందా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. మరికొంత మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారనే వాదన కూడా ఉంది.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరి చేరికలతో ఏపీ రాజకీయాల్లో కీలక జిల్లాగా ఉన్న కృష్ణాలో టీడీపీ మరింతగా బలోపేతం కానుందనే వాదన వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే... కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దేవినేని నెహ్రూ టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవినేని నెహ్రూ గతంలో టీడీపీలో ఒక వెలుగు వెలిగిన ఆయన పార్టీ చీలిక నేపథ్యంలో ఎన్టీఆర్ తరఫున నిలిచారు. ఆ తర్వాత నెహ్రూ కాంగ్రెస్ లో చేరిపోయారు.

Congress leader Devineni Nehru may join in Tdp

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో దేవినేని నెహ్రూ రాజకీయ జీవితం డైలమాలో పడింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్లీ తన సొంత గూటికి చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారట.

మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకే చెందిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా వేదవ్యాస్ పనిచేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరుణంలో ఆయన అందులో చేరారు.

ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికే వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటున్న వేదవ్యాస్ తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఈ నేతల చేరిక టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Devineni Nehru may join in Tdp.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి