Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో షర్మిల ఎంట్రీ కోసం రాయబారం: కాంగ్రెస్‌కు మాస్ ఇమేజ్

YS Sharmila: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. ఏపీ. ఇంకో మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడొచ్చు. లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఫిబ్రవరి/మార్చి నెలల్లో షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టింది.

ఈ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గ స్థాయిలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఇన్‌ఛార్జీలను మార్చుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. వాళ్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాల్లో కొత్త వారికి ప్రాధాన్యతను ఇస్తోంది.

Congress leader N Raghuveera Reddy met AICC Chief Mallikarjun Kharge

ఏపీలో దాదాపుగా ఉనికి కోల్పోయిన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికలపై దృష్టి సారించింది. పొరుగునే ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. దీనికోసం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది.

ఈ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి దించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు ఇదివరకే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో ప్రియాంక గాంధీ నిర్వహించబోయే సభలో షర్మిలను చేర్చుకోవాలని భావిస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి.. బెంగళూరుకు వచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినందుకు ఖర్గేకు అభినందనలు తెలియజేశారు రఘువీరా.

Congress leader N Raghuveera Reddy met AICC Chief Mallikarjun Kharge

ఏపీ రాజకీయాలపై చర్చించారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. ఇక్కడి రాజకీయ స్థితిగతులు, పార్టీ గురించి ఖర్గే.. ఆయనను అడిగి తెలుసుకున్నారు. రాజధాని అమరావతి అంశం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి పూర్తి వివరాలను సేకరించారు.

ఎన్నికలు సమీపించే సమయానికి పీసీసీ అధ్యక్షుడి మార్పు అంశం కూడా ఖర్గే-రఘువీరా మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. గిడుగు రుద్రరాజు స్థానంలో మరో నేత పేరును పరిశీలించినట్లు సమాచారం. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిని కీలక బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

వైఎస్ షర్మిలకు ఏపీ బాధ్యతలను అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయంపై వారిద్దరు చర్చించినట్లు చెబుతున్నారు. రఘువీరారెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. దాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ తరఫున ఏపీ ఇన్‌ఛార్జీగా నియమిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే అంశంపై ఖర్గే ఆరా తీశారని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+