కల్యాణం, మూడ్రోజుల్లో సంచలనాలు: పవన్‌పై వెంకయ్య
ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక లోకకళ్యాణం అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శనివారం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మోడీ ఫర్ పిఎం పేరిట శనివారం భారీ సభ నిర్వహించారు. ఈ సభలో వెంకయ్య మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ పార్టీని ప్రస్తావిస్తూ... పవన్ రాక లోక కళ్యాణం అన్నారు. అప్పుడే ఏమైందని, రెండు మూడు రోజుల్లో ఇంకా ఆసక్తి కలిగే అంశాలు తెలియబోతున్నాయన్నారు. సంచలనం కలిగించే విషయాలు వస్తాయన్నారు. అఫ్పటిదాకా టీవీలలో, పేపర్లలో వచ్చే వార్తలే చూడాలని, మరో ఏడు రోజుల తర్వాత ఇప్పుడున్న మోడీ ప్రభావం మూడొంతులు పెరగబోతుందన్నారు.

కాంగ్రెస్‌కు శాశ్వతంగా సెలవ్ ఇవ్వాలని, ఈ దేశంలో కాంగ్రెస్ నుంచి అందరూ విముక్తి పొందాలని, దేశంలో ఎక్కడకు వెళ్లినా కాంగ్రెస్ పోవాలి... బిజెపి రావాలి... మోడీ ప్రధాని కావాలి అని కోరుతున్నారన్నారు. అక్షరాలా ఇదే జరగబోతుందన్నారు. తమ మాట వినకపోతే పైనుంచి నీళ్లు ఆపేస్తాం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. పోలవరానికి నీళ్లు ఆపడం ఎవరితరమంటూ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ హయాంలో మొత్తం అవినీతే రాజ్యమేలిందని, ఆకాశం, భూగర్భాన్ని కూడా వదిలిపెట్టలేదని విమర్శలు గుప్పించారు. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్రంలో ఖాళీ అయిపోతున్నదని, ఉన్న కొద్దిపాటి మంది ఇప్పుడు బస్సు యాత్ర ఆ తర్వాత తీర్థయాత్ర చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కనీసం ముందుచూపు కూడా ప్రదర్శించలేదని, హైదరాబాద్‌లో ప్రజల భవిష్యత్ గురించిగాని, పోలవరం గతేంటనిగాని, ఆలోచించలేదని అన్నారు.












Click it and Unblock the Notifications