వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి డిజైన్ల తిరస్కరణ వెనుక పెద్ద కుట్ర: కెవిపి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో చేప‌ట్టిన ప‌నుల్ని స‌త్వరం పూర్తి చేయ‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాత్సారం చేస్తున్నార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఆరోపించారు.

రాజ‌ధాని నిర్మాణ ప‌నులు పూర్తి చేయ‌డానికి మ‌రోసారి అధికారం ఇవ్వాల‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతూ ప‌బ్బం గ‌డుపుకునే ఎత్తుగ‌డ‌ల్లో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు అంత‌ర్జాతీయంగా పేరొందిన నార్మ‌న్‌ఫాస్ట‌ర్ రూపొందించింన రాజ‌ధాని డిజైన్ల‌ను తిర‌స్క‌రించారని కెవిపీ విమర్శించారు.

రెండేళ్ల క్రితం మొద‌లుపెట్టిన రాజ‌ధాని డిజైన్ల ఎంపిక ప్రక్రియ‌ను ఇప్ప‌టికే పూర్తి చేయ‌కుండా జాప్యం చేయ‌డం రాజకీయం చేయ‌డ‌మేన‌ని కేవీపీ అన్నారు. ఇప్ప‌టికే ప‌లుసార్లు మార్పులు చేసిన నార్మ‌న్‌ఫాస్ట‌ర్ డిజైన్లు బాగోలేద‌ని తిర‌స్క‌రించి, అంతిమంగా సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నేతృత్వంలో డిజైన్ల‌ను రూపొందించాల‌ని ఆదేశించ‌డం చంద్ర‌బాబు కుటిల రాజ‌కీయ ఆలోచ‌న ధోర‌ణికి అర్థం ప‌డుతోంద‌న్నారు కెవిపి.

Congress MP KVp slams on Ap chief minister Chandrababu naidu

అంత‌కుముందు అద్భుతం అమోఘం అంటూ పొగిడిన జ‌పాన్ ఆర్కిటెక్ట్ సంస్థ మ‌కీని ఏక‌ప‌క్షంగా ప‌క్క‌కు త‌ప్పించిన చంద్ర‌బాబు... ఇప్పుడు నార్మ‌న్ ఫాస్ట‌ర్ డిజైన్ల‌ను కూడా ప‌క్క‌కు త‌ప్పించి త‌న‌కు రాజ‌మౌళి కావాలంటున్నాడని కేవీపీ ఎద్దేవా చేశారు.

రైల్వే ట్రాక్‌ల భద్ర‌త‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ఎంపీ కేవీపీ రామ చంద్ర‌రావు లేఖ రాశారు. జీఎస్టీ 18 శాతానికి పెంచు వ‌ల్ల ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో రూ.585 కోట్ల మ‌ర‌మ‌త్తు ప‌నులు నిలిచిపోయాయని అన్నారు. స‌మ‌స్య‌ను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

English summary
Congress MP Kvp Ramachandrarao made allegations on Ap chiefminister Chandrababu naidu on Sunday.There is a conspiracy Behind the Amaravati designs rejected said Kvp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X