'సీపీ సవాంగ్ సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది'
హైదరాబాద్: ఏపీలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్‌మనీ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అధిక వడ్డీకి అప్పులిచ్చి, బాధితులు మాన ప్రాణాలను దోచుకుంటున్న ఈ కాల్‌మనీ వ్యవహారాన్ని బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాల్‌మనీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడి వల్లే ఆయన సెలవు వెళ్లారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే కాల్‌మనీ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళుతున్నారు. 10 రోజుల సెలవు కావాలని ఆయన పై అధికారులను అభ్యర్థించారు. పరిశీలించిన అధికారులు వెంటనే సెలవు మంజూరు చేశారు. దాంతో కొన్నిరోజుల పాటు ఆయన విరామం తీసుకుంటున్నారు.
గౌతమ్ సవాంగ్ స్థానంలో నగర ఇంఛార్జ్ సీపీగా సురేంద్ర బాబు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, గౌతమ్ సవాంగ్ సెలవుల పైన వెళ్లడానికి కాల్ మనీ వ్యాపారుల నుంచి రాజకీయంగా వస్తున్న ఒత్తిళ్లే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, గౌతమ్ సవాంగ్‌కు ప్రభుత్వం గత నెల 24వ తేదీనే లీవ్ ఇచ్చిందని చెబుతున్నారు. అతను అంతకుముందే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాల్ మనీ కేసుకు దీనికి సంబంధం లేదని అంటున్నారు. గౌతమ్ సవాంగ్ 17వ తేదీ నుంచి 27వ తేదీవరకు సెలవులో ఉంటారు. సవాంగ్ తన కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియాతో వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications