YS Sharmila: వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ ప్రతిపాదనలివే! ఆమె పెట్టిన షరతులివే..?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ స్ధానిక ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అదే సమయంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరిక కోసం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సిద్దమవుతున్నారు. షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో తెలంగాణలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి పలు జాగ్రత్తలు తీసుకుంటున్న షర్మిల.. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం, తన చేరికకు పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం, తాను, తన అనుచరగణం ఆ పార్టీలో చేరిక కోసం వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఢిల్లీలోనే పాగా వేసి ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. ఇందులో ముందుగా కాంగ్రెస్ అధిష్టానంతో జరుపుతున్న చర్చల్లో షర్మిల భర్త అనిల్ కుమార్ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు ఆప్షన్లు పెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో ఆమె ఏదో ఒకటి ఎంచుకోవచ్చని సమాచారం.

congress partys proposals to ys sharmila and her conditions for ysrtp merger and joining

ఇందులో మొదటిది షర్మిలను తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి అనంతరం వైఎస్సార్టీపీని తమ పార్టీలో విలీనం చేసుకోవడం, ఆమెకు ఏపీసీసీ పగ్గాలు ఇవ్వడం. రెండవది ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇచ్చి కడప ఎంపీ సీటు నుంచి బరిలోకి దింపడం. మూడో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చి రాజ్యసభకు ఎంపీగా పంపడం. ఈ మూడు ఆప్షన్లు బ్రదర్ అనిల్ ముందు కాంగ్రెస్ అధిష్టానం ఉంచినట్లుగా సమాచారం.

అయితే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ ముందు పలు కీలక షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవాలంటే తాను కోరిన వాళ్లకు ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఇందులో ప్రధాన మైనది. అలాగే పొత్తులు, ఇతర నిర్ణయాలపై తనకు సేచ్ఛ ఇవ్వడం వంటివి ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో బాబాయ్ వివేకా కుమార్తె సునీతారెడ్డి, తాను కాంగ్రెస్ ఎంపీలుగా బరిలోకి దిగాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే పరిస్ధితి లేకపోవడమే ఇందుకు కారణం. అలాగే రాయలసీమలో బైరెడ్డి వంటి వారిని, అమరావతిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతల్ని ఎలాంటి షరతుల్లేకుండా కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+