మోడీకి బాబు, జగన్ భయపడుతున్నారు, అందుకే హోదాపై వెనక్కు, 2019లో హోదాఇస్తాం: రాహుల్

2019 లో తామంతా కలిసి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంటామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.ప్రధానమంత్రి మోడీ అంటే చంద్రబాబునాయుడ

గుంటూరు: 2019 లో తామంతా కలిసి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంటామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.ప్రధానమంత్రి మోడీ అంటే చంద్రబాబునాయుడుకు భయపడుతున్నారని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ గుంటూరులో నిర్వహించిన సభలో వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

ఈ సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేసింది. అంతేకాదు రాజకీయంగా టిడిపిని,వైసీపీని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నాలు చేసింది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో ఏ రకమైన హమీలు ఇచ్చిందో రాహుల్ గాంధీ వివరించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో బిజెపి టిడిపి కూటమి కూడ ఇచ్చిన హమీలను విస్మరించిన విషయాలను రాహుల్ ప్రస్తావించారు.

 మోడీ అంటే భయపడుతున్నారు.

మోడీ అంటే భయపడుతున్నారు.

భారత ప్రధానమంత్రి మోడీ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని ఎఐసిసి ఉపాధ్యక్షుడు ఆరోపించారు. అందుకే ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం లేదన్నారు. మరో వైపు ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైసీపీ చీప్ జగన్ కూడ మోడీ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే టిడిపి, వైసీపీలు ప్రత్యేక హోదా కోసం మాట్లాడకపోవడం దారుణమన్నారు.

తిరుపతి వేదికగానే మోడీ మోసం చేశారు

తిరుపతి వేదికగానే మోడీ మోసం చేశారు

2014 ఎన్నికల ముందు తిరుపతి వేదికగా మోడీ , చంద్రబాబు కలిసి ప్రచారం చేశారు. అయితే ఈ సభలో పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పిస్తామని హమీ ఇచ్చారు. హిందూ ధర్మం గురించి పదేపదే మాట్లాడే నరేంద్రమోడీ తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడని ఆయన మోడీపై విమర్శలు చేశారు.హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కు మోడీకి లేదన్నారు రాహుల్ గాంధీ.

కమీషన్ల కోసమే పోలవరానికి కేంద్రం నిధులు వద్దంటున్నారు

కమీషన్ల కోసమే పోలవరానికి కేంద్రం నిధులు వద్దంటున్నారు


కేంద్రం నుండి పోలవరానికి కేంద్రం నుంది నిధులను రాష్ట్ర ప్రభుత్వం వద్దనడానికి కమీషన్లే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కు 90 శాతం నిధులను ఇవ్వాలని చట్టం చెబుతోన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ఈ ప్రాజెక్టుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని ప్రకటించడం కమీషన్ల కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

లక్ష ఉద్యోగాలు కూడ ఇవ్వలేదు

లక్ష ఉద్యోగాలు కూడ ఇవ్వలేదు

అధికారంలోకి వచ్చే సమయంలో రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. కానీ, లక్ష ఉద్యోగాలను కూడ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ఫోటోలకు ఫోజులిస్తున్నారని ఆయన మోడీపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రాభివృద్ది జరగాలంటే ప్రత్యేక హోదా అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని ఆయన గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+