వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి రాహుల్ గాంధీ, జగన్‌కు చుక్కలు: చంద్రబాబు జోస్యం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకులు తగులుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనతో ఓ దెబ్బ తగిలితే, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకులు తగులుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనతో ఓ దెబ్బ తగిలితే, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వల్ల మరో దెబ్బ తగులుతోంది.

జగన్‌కు చివరి నిమిషంలో అలా షాకిచ్చిన పవన్ కళ్యాణ్జగన్‌కు చివరి నిమిషంలో అలా షాకిచ్చిన పవన్ కళ్యాణ్

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడితే ఆ దెబ్బ కచ్చితంగా జగన్ మీదే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ఎలాగైనా గెలవాలని జగన్, వైసిపి నేతలు భావిస్తున్నారు. అందుకు ఆయన దాదాపు ఏ అంశాన్ని వదులు కోవడం లేదు.

అధికారమే పరమావధిగా..

అధికారమే పరమావధిగా..

తనకు అధికార పరంగా పోటీ వస్తారనే అభిప్రాయం ఉన్న వారితో తప్ప జగన్ ఎవరితోనైనా కలిసేందుకు, ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో బిజెపికి ఎలాగు అధికారంలోకి వచ్చే బలం లేదు. కాబట్టి ఆ పార్టీతోను అంతర్గత ఒప్పందానికి జగన్ సిద్ధపడ్డారు.

టిడిపిని దోషిగా నిలబెట్టి...

టిడిపిని దోషిగా నిలబెట్టి...

2019 ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, విభజన హామీలు కేంద్రం నెరవేర్చేలా ప్రయత్నించడం లేదని, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, రాజధాని నుంచి పోలవరం వరకు ఏదీ పూర్తి కావడం లేదని చెబుతూ టిడిని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది.

రివర్స్ అవుతోన్న జగన్ ప్లాన్

రివర్స్ అవుతోన్న జగన్ ప్లాన్

ప్రత్యేక హోదా మొదలు.. అన్నింటా జగన్ ప్లాన్ రివర్స్ అవుతోంది. తొలుత హోదా పేరుతో టిడిపి, బిజెపిని ఇరుకున పడేసే ప్రయత్నాలు చేశారు. కానీ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని చెప్పారు. అంతేకాదు, రేపో మాపో టిడిపితో బిజెపి పొత్తును తెంచుకుంటుందని నాడు భావించారు. కానీ ఆ విషయంలో జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

రాహుల్ సభ.. జగన్‌కు చిక్కులే

రాహుల్ సభ.. జగన్‌కు చిక్కులే

విభజన నేపథ్యంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పైన ఆగ్రహంతో ఉన్నారు. అందుకే 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఏపీలో అసలు కాంగ్రెస్ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ నిన్నటి (ఆదివారం) రాహుల్ సభతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇలాగే రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై వరుసగా మరికొన్ని సభలు పెడితే.. జగన్‌కు నష్టం తప్పదంటున్నారు. కాంగ్రెస్ ఎంతగా బలపడితే అది జగన్‌కే ఇబ్బందికరమవుతుందని అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి బలహీనపడటం వల్ల కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

మోడీతో భేటీ కూడా చిక్కులు తెచ్చినట్లే

మోడీతో భేటీ కూడా చిక్కులు తెచ్చినట్లే

జగన్‌ను ఇప్పుడు ప్రత్యేక హోదా చిక్కులు ముసురుకున్నాయి. ప్రధాని మోడీతో భేటీకి ముందు వరకు ప్రత్యేక హోదా విషయంలో జగన్ గట్టిగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం కనిపించింది. కానీ మోడీతో భేటీ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు తదనంతర పరిణామాలు చూస్తుంటే జగన్‌కు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఏమాత్రం లేదని అర్థమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి రాహుల్ సభలోను జాతీయస్థాయి నాయకులు జగన్ పైన విమర్శలు గుప్పించారు. కేసుల కోసమే జగన్.. మోడీకి దగ్గరవుతున్నారని, కానీ చివరకు మోడీ కూడా జగన్‌ను వదిలిపెట్టరని వారు వ్యాఖ్యానించారు. హోదా ఇవ్వకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వమని షరతు విధించాలని సూచించారు.

English summary
The Congress party, if voted to power in the 2019 general elections, will grant special category status to Andhra Pradesh on top priority, Congress vice president Rahul Gandhi said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X