కెసిఆర్‌కు జైరాం 'దళిత సిఎం'షాక్: కిరణ్‌పై కీలక వ్యాఖ్య

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ముఖ్యమంత్రి అంశంపై ఝలక్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు చెప్పారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెసు దానిని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. జైరామ్ రమేష్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెసు అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు. తద్వారా కెసిఆర్‌ను ఆయన ఇరుకున పెట్టారని భావిస్తున్నారు. కాగా, పొత్తులు లేకున్నా తాము గెలుస్తామని జైరాం చెప్పారు. కెసిఆర్ ఒకప్పుడు యువజన కాంగ్రెసు పార్టీ నేతనే అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో, సీమాంధ్రకు పోలవరం అంతే ముఖ్యమని కెసిఆర్‌కు చురకలంటించారు.

రెండు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. పొత్తు లేకపోయినా తాము అత్యధిక స్థానాల్లో గెలుస్తామన్నారు. రెండు ప్రాంతల్లో అభివృద్ధి, సామాజిక న్యాయం తీసుకు వస్తామన్నారు.

Congress raises Dalith CM to check KCR

ఇరు ప్రాంతాల ఐక్యకార్యాచరణ సమితిలతో అభివృద్ధి కమిటీలు వేస్తామన్నారు. తెలంగాణలో తమకు ఒంటరిగాపోటీ చేసే సత్తా ఉందన్నారు. తెలంగాణలో దళితుడినే సిఎం చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో తెరాస పాత్ర ఏమాత్రం లేదన్నారు.

జెఏసి నేతలు కోరితే తాము టిక్కెట్లు ఇస్తామన్నారు. సామాజిక న్యాయం అంటే 20-20 మ్యాచ్ కాదని ఎద్దేవా చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ మాత కాదని... నిర్మాత అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డిపై..

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాల పైన విచారణ జరిపిస్తామని జైరామ్ రమేష్ చెప్పారు. కిరణ్ హద్దులు దాటారని, అతని వల్లే ఇబ్బందులు వచ్చాయని వ్యాఖ్యానించారు. కిరణ్ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పని చేయలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+