చిరును సిఎం చేస్తే: సీమాంధ్రపై డొక్కా ఆసక్తికర వ్యాఖ్య

దీనిపై డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడారు. ముందే చిరును ముఖ్యమంత్రిగా చేస్తే సీమాంధ్రలో పార్టీ పరిస్థితి బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై విమర్శలు గుప్పించగా... డొక్కా ఆయనకు ధీటుగా స్పందించిన విషయం తెలిసిందే.
మాదే గెలుపు: పొన్నాల
సోమవారం వెలువడనున్న మున్సిపల్ ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని, తమ పార్టీ ఆధిక్యం చాటుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వేరుగా ఆదివారం ధీమా వ్యక్తం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) బోధన, బోధనేతర సిబ్బంది ఆదివారం పొన్నాల లక్ష్మయ్యను కలిశారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని చెప్పారు. ఇతర పార్టీల అభ్యర్థులు లేని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సునాయాసమని, పోటీ ఉన్న చోట తమ అభ్యర్థులే గెలుస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు స్థానిక ఎన్నికల్లో పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications