జగన్ ధర్నాపై చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు-అప్పులపై ఎవర్ని నమ్మాలని ప్రశ్న..!

ఏపీలో వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఢిల్లీలో జగన్ చేసిన ధర్నా విఫలమైందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. జగన్ మోడీకి బిడ్డలాంటోడని, మోడీ పర్మిషన్ ఇచ్చి, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జగన్ చేత ధర్నా చేయించారని ఆయన ఆరోపించారు. జగన్ ఎందుకు ధర్నా చేశారు? ఓడిపోయినందుకు ధర్నా చేశారా? సానుభూతి కొరకు ధర్నా చేస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ ధర్నా వల్ల జగన్ అబాసు పాలయ్యారన్నారు. జగన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కొట్టాడని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో జగన్ వ్యాఖ్యానించడం అబద్ధమని చింతా మోహన్ తెలిపారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు ఇరువురూ చదువుకునే రోజుల్లో చెరొక గ్రూపుకు నాయకత్వం వహించేవారన్నారు.ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడిగారని, ప్రజలు ఇచ్చారు అంతే అన్నారు. జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ, కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయాయని ఆరోపించారు.

congresss leader chinta mohan slams ys jagan s delhi dharna demand naidu exact figure on loans

వైసీపీ పాలనలో నిర్వీర్యం అయిపోయిన కార్పొరేషన్లను టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోందని చింతా మోహన్ ప్రశ్నించారు.నిధులు ఇస్తారా? ఇవ్వరా? టిడిపి ప్రభుత్వ వైఖరి ఏమిటని నిలదీశారు. నిన్న తాను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిని కలిశానని, ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి ఏమిటని అడిగితే ఆ అధికారి నోరే కదపలేదన్నారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కార్పొరేషన్లకు దండిగా నిధులు ఇచ్చి, యువతను ఆదుకుంటున్నారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇందుకు కారకులెవరో జగన్, చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మోడీ, చంద్రబాబు చెవిలో పువ్వులు పెట్టారని, అమరావతి, పోలవరం నిర్మాణం కు కేంద్ర బడ్జెట్లో ఒక్క పైసా గ్రాంట్ గా నిధులు ఇవ్వలేదన్నారు. అమరావతి కి 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం బిజెపి ప్రభుత్వ ద్వంద నీతికి నిదర్శనమన్నారు.

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి 7 లక్షల కోట్లు అని ఒకరు, కాదు 13 లక్ష కోట్లు అని మరొకరు చెబుతున్నారని, ఎవరి మాటలు నమ్మాలో జనానికి అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర అప్పులుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+