భద్రతా వలయంలోకి అమరావతి: రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవందర్ అనే కార్మికుడి మృతితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన గుంటూరు జిల్లా పోలీసులు తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టరాదని ఆదేశాలు జారీచేశారు. పైవేటు వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
దీంతో పరిస్థితి అక్కడ పూర్తిగా అదుపులోకి వచ్చింది. మరోవైపు కార్మికుడు మృతి చెందిన ఘటనపై కార్మిక శాఖ జిల్లా జాయింట్ కమిషనర్‌తో విచారణకు ఆదేశించినట్టు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మీడియాకు తెలిపారు. విచారణ నివేదికను వారం రోజుల్లో ఇవ్వాలని కోరినట్టు చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో కార్మికుల రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంగళవారం సంభవించిన ఈ ప్రమాద ఘటనతో తాత్కాలిక సచివాలయ ప్రాంతంలో రెండు బ్లాక్‌లను నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ పనులు నిలిచిపోయాయి.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్: మిల్లర్‌లో పడి మృతి చెందిన కార్మికుడు ఇతడే
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో మంగళవారం మరో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన నిర్మాణ పనుల్లో చేరిన దేవేందర్.. క్లీన్ చేసిన అనంతరం.. పనిచేస్తున్న యంత్రంలోకి తొంగిచూడటం వల్ల ప్రమాదానికి గురై.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాంక్రీటు మిశ్రమాన్ని కలిపే యంత్రాన్ని క్లీన్ చేసి.. అనంతరం పనిచేస్తున్న యంత్రంలోకి తొంగిచూశాడని, దీంతోనే ప్రమాదం జరిగిందని నిర్మాణ కంపెనీల అధికారులు తెలిపారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్: మిల్లర్‌లో పడి మృతి చెందిన కార్మికుడు ఇతడే
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని.. కార్మికుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. అయితే, మిగిలిన కార్మికులు.. పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అయినప్పటికీ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన కార్మికులు నిర్మాణ ప్రాంగణంలో ఉన్న అంబులెన్స్‌కు నిప్పుపెట్టారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్: మిల్లర్‌లో పడి మృతి చెందిన కార్మికుడు ఇతడే
ఎల్ అండ్ టీ సంస్థ కార్యాలయంలో ఫర్నిచర్‌ని, కంప్యూటర్‌ని ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వేందుకు సిద్ధం కావడంతో ఉన్నతాధికారులు హుటాహుటిన అగ్నిమాపక యంత్రాన్ని, పోలీసు అదనపు బలగాలను రప్పించారు. సచివాలయ ప్రాంగణంలో నాలుగు భవనాల నిర్మాణాన్ని చేపడుతున్న ఎల్‌అండ్‌టీ పనులను నిలిపివేయడంతో పోలీసులు కార్మికులను ప్రాంగణం నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్: మిల్లర్‌లో పడి మృతి చెందిన కార్మికుడు ఇతడే
ఈ సందర్భంగా ప్రాంగణానికి వచ్చిన సీపీఎం, ఇతర కార్మిక సంఘాల నేతలు కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క, గుంటూరు జేసీ శ్రీధర్, ఎస్పీ త్రిపాఠి, ఆర్డీవో తదితరులు కార్మిక శాఖ అధికారులతో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకుని, నిర్మాణ కంపెనీ ఉన్నతాధికారులతో చర్చించారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్: మిల్లర్‌లో పడి మృతి చెందిన కార్మికుడు ఇతడే
అనంతరం గుంటూరు జేసీ చెరుకూరి శ్రీధర్ వి లేకరులతో మాట్లాడుతూ ప్రమదంలో మృతి చెందిన కార్మికుడికి ప్రభుత్వం చంద్రన్న బీమా నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని చెల్లించేందుకు ఇప్పటికే మంత్రి ప్రకటించారన్నారు. మొత్తంగా మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల మేర పరిహారం అందించనున్నట్టు విలేకరులకు తెలిపారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్: మిల్లర్‌లో పడి మృతి చెందిన కార్మికుడు ఇతడే
దీంతోపాటు రాజధాని నిర్మాణ క్రమంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సత్వరం చర్యలు తీసుకొంటామన్నారు. ప్రాంగణంలో నిర్మాణ కంపెనీలు కార్మికుల రక్షణ నిమిత్తం తీసుకున్న చర్యలపై కార్మిక శాఖ అధికారుల ద్వారా విచారణ చేయిస్తామన్నారు. నిర్మాణ కంపెనీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన వారిలో గుంటూరు ఎస్పీ త్రిపాఠి, ఆర్డీవో భాస్కర నాయుడు, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
-
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???












Click it and Unblock the Notifications