వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మా’ఎన్నికలు వాయిదా- చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్: ఇమేజ్ - డామేజ్..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

'మా' ఎన్నిక వ్యవహారం వివాదంగా మారింది. ఈ మొత్తం పరిణామాలు తెలుగు సినీ ప్రముఖల పైన ప్రభావం చూపుతోంది. ఎన్నికల పేరుతో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవటంలో సీనియర్ నటులు కొందరు దూరంగా ఉండటం..మరి కొందరు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడుతుండటంతో మొత్తంగా 'మా' ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నటులు బాధ్యత తీసుకొని 'మా' లో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోలేరా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

 ఏకాభిప్రాయం అసాధ్యం..

ఏకాభిప్రాయం అసాధ్యం..

ఏకాభిప్రాయం సాధ్యం కావటం లేదు. ఆలస్యం చేసిన కొద్దీ..సమస్యలు-విభేధాలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో..రెండు ప్రత్యామ్నాయలే పరిస్థితికి పరిష్కార మార్గంగా సినీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే, అక్కడా భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అంతిమంగా మెజార్టీ అభిప్రాయం మేరకు ఈ రెండిట్లో ఒకటి ఫైనల్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ తేదీపై కొందరు సభ్యులు రాసిన లేఖలపై- క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు కమిటీని సభ్యుల అభిప్రాయం కోరారు.

 చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్..

చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్..

క్రమశిక్షణ సంఘం నుంచి రాజీనామా చేశాను కాబట్టి తాను ఈ విషయంపై స్పందించలేనని చిరంజీవి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన తన అభిప్రాయం చెబితే దానిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి పెద్ద దిక్కుగా ఉండటంతో..ఆయన అభిప్రాయ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మోహన్ బాబు సైతం ఎన్నికలను వాయిదా వేయాలని కోరినట్లుగా చెబుతున్నారు. మరో సభ్యురాలు జయసుధ ఎన్నికలు జరగాల్సిందేనని కోరుకుంటున్నారు.

 ఎన్నికలు అనివార్యం..

ఎన్నికలు అనివార్యం..

ప్రస్తుతం పరిశ్రమను నమ్ముకున్న వారంతా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నారని..వారికి మేలు చేయాలంటే కమిటీ ఉండాల్సిందేనది జయసుధ వాదన. దీంతో..క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది మరింత వివాదాస్పదమవుతుందనే భావన కృష్ణంరాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రస్తుత 'మా' కమిటీ పదవీ కాలం 2021 మార్చితో ముగిసిపోయింది. ఈ పరిస్థితుల్లో 'మా' అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచువిష్ణులు దిగారు.

 తాత్కాలిక కమిటీకి ప్రతిపాదన..

తాత్కాలిక కమిటీకి ప్రతిపాదన..

ప్రకా‌ష్ రాజ్‌కు మెగాకుటుంబం పరోక్షంగా మద్దతు ఇస్తోంది. మంచువిష్ణుకు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ఎన్నికల తేదీని ప్రకటించాలని.. ఒక వేళ కోవిడ్‌ వల్ల వెంటనే ఎన్నికలు జరపలేకపోతే తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రకా్‌షరాజ్‌ ప్యానల్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్. ఈ ప్రతిపాదన పైన ప్రస్తుత కార్యవర్గం స్పందించలేదు. ఏకగ్రీవం పైన మెగా బ్రదర్ నాగబాబు వంటి వారు ఇప్పటికే వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టేసారు.

Recommended Video

Telangana కళాకారులకు ఏంతక్కువ.. MAA ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న సీవీఎల్ | Oneindia Telugu
 వాయిదా లేదా తాత్కాలిక కమిటీ..

వాయిదా లేదా తాత్కాలిక కమిటీ..

'మా'ఎన్నికల బై లాస్ లో కాల పరిమితి అంశం లేకపోవటంతో..ఎమెర్జెన్సీ పరిస్థితుల్లో ఆరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ప్రస్తుత కమిటీకి..సినీ పెద్దలకు న్యాయ నిపుణుల నుంచి సలహా అందినట్లు తెలుస్తోంది. దీంతో.. ఎన్నికలను వాయిదా వేయటమా...లేక..తాత్కాలిక కమిటీ వేయటమా అనే రెండు ప్రతిపాదనల పైన ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది.

English summary
MAA Elections seem to be post phoned for some time, till the disputes come to an end. Other wise temporory committee may be appointe with acceptable persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X