వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాఫ్ రగడ: కెసిఆర్‌పై ఎపిఎన్జీవోల ఫైర్, వార్ రూమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ/ హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన వివాదం ముదురుతోంది. తెలంగాణ సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగులు పనిచేయడానికి వీలు లేదని వ్యాఖ్యానించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఎపిఎన్జీవోల సంఘం నేతలు మండిపడ్డారు. కెసిఆర్ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని నాయకులు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులను పనిచేయనీయమని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని వారన్నారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులు నిబంధనల మేరకే ఉన్నారని వారన్నారు. కెసిఆర్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని వారు మండిపడ్డారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే ఉద్యోగుల విభజన జరుగుతోందని వారన్నారు. ఎపిలో రాజధాని ఏర్పడిన తర్వాత వచ్చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు.

Controversy over division of staff

ఇదిలావుంటే, తాము ఆంధ్రప్రభుత్వంలో పనిచేయబోమని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. మార్గదర్శక సూత్రాల్లో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులు తప్పు దారి పట్టిస్తున్నారని విమర్సించారు. ఉద్యోగుల సంఖ్యను బట్టి కాకుండా స్ట్రెంగ్త్‌ను బట్టి విభజన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమల్‌నాథన్‌ను కలిశారు. కమలనాథన్ కమిటీకి అన్ని అంశాలను వివరించామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు విఠల్ అన్నారు. ఉద్యోగుల విభజన పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని ఆంద్రకు కేటాయించడం దారుణమని ఆయన అన్నారు.

విభజనపై స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు లేకుండా ఉద్యోగుల పంపకాలు చేయడం సమంజసం కాదని కమలనాథన్‌తో చెప్పినట్లు దేవీప్రసాద్ చెప్పారు. ముందు మార్గదర్శకాలపై స్పష్టత ఇచ్చిన తర్వాత ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. స్థానికత అంశాన్ని కమలనాథన్ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు.

తెరాస కార్యాలయంలో వార్ రూమ్

ఉద్యోగుల విభజనపై వివాదం చెలరేగిన నేపథ్యంలో తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు తెలంగాణ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అభ్యంతరాలను స్వీకరిస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు దురుద్దేశంతో తెలంగాణలో ఉండిపోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. అభ్యంతరాలను తమకు పంపించాలని ఆయన సూచించారు. ఈమెయల్ ద్వారా పంపించవచ్చునని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చునని, వార్ రూమ్‌కు వచ్చి చెప్పవచ్చునని ఆయన వివరించారు.

English summary
APNGOs leaders retaliated Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao comments on Seemandhra staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X