ఏపీలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 4,570 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 4,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారని తెలిపింది.

ఏపీలో కరోనా విలయం
ఏపీలో కరోనా విలయం తాండవం చేస్తోంది. కేసుల సంఖ్య భారీగానే పెరుగుతున్నాయి. శనివారం 35, 673 శాంపిల్స్ పరీక్షించగా.. 4,955 మంది కరోనాబారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 669 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు.

చిత్తూరులో వైరస్ డెంజర్ బెల్
రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,124 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తర్వాత విశాఖ పట్నం 1,028, గుంటూరు 368, అనంతపురం 347, నెల్లూరు 253, తూర్పుగోదావరి 233, విజయనగరం 209 , కృష్ణా 207 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 187, ప్రకాశం 178, కడప 173, కర్నూలు 168, పశ్చిమ గోదావరి 95 మంది వైరస్ బారిన పడ్డారు.

వచ్చే రెండు వారాల్లో భారీగా కేసులు
ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 14శాతం మేరకు నమోదు అవుతోంది. రానున్న రోజుల్లో ఈ కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తమ స్వగ్రామలకు తరలివచ్చారు. కరోనా నిబంధనలు పక్కన పెట్టి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. ఈనేపథ్యంలో రానున్న రెండు, మూడు వారాల్లో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications