కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా వ్యాప్తి: తాజాగా 434 కేసులు; కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 434 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,59,134 గా ఉంది. మహమ్మారి వల్ల గత 24 గంటల్లో ఎవరు ప్రాణాలు కోల్పో లేదు. అయితే ఏపీలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 14,499కి చేరుకుంది.

ముంబైలో కరోనా పంజా: సెకండ్ వేవ్ గరిష్ట కేసులను మించి; తాజాగా 15,166 కొత్తకేసులుముంబైలో కరోనా పంజా: సెకండ్ వేవ్ గరిష్ట కేసులను మించి; తాజాగా 15,166 కొత్తకేసులు

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్త కేసులు నమోదు చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్త కేసులు నమోదు చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఏపీలో నమోదయిన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. మరోవైపు ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు సైతం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి పెరుగుతున్న కేసుల వ్యాప్తి ఆందోళనకరంగా మారుతోంది. నవంబర్ 10వ తేదీ తర్వాత నిన్న, ఈరోజు మాత్రమే కరోనా అత్యధిక కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది.

కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్న 102 మంది బాధితులు

కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్న 102 మంది బాధితులు

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారినుండి 102 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 32 వేల 785 మంది శాంపిల్స్ ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,14,58,731 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో వివిధ ఆస్పత్రులలో 1848 కరోనా మహమ్మారికి చికిత్స పొందుతున్నారు. ఒక వైపు కరోనా కేసులు పెరుగుదల, మరోవైపుఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో ప్రజలను భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు వాటిల్లుతుందని పదే పదే హెచ్చరిస్తోంది.

 జిల్లాల వారీగా తాజాగా నమోదైన కేసుల లెక్కలు ఇవే

జిల్లాల వారీగా తాజాగా నమోదైన కేసుల లెక్కలు ఇవే

ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల వివరాలను చూస్తే చిత్తూరు జిల్లాలో 68 కరోనా కేసులు, విశాఖపట్నం జిల్లాలో 63 కరోనా కేసులు,కృష్ణాజిల్లాలో 61 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 45 కరోనా కేసులు, విజయనగరం జిల్లాలో 39 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 34 కరోనా కేసులు,నెల్లూరు జిల్లాలో 30 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 30 కరోనా కేసులు ,అనంతపురం జిల్లాలో 27 కరోనా కేసులు,కడపలో 13 కరోనా కేసులు , శ్రీకాకుళంలో 9, కర్నూలులో 8 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో తాజాగా నలుగురికి ఒమిక్రాన్

ఏపీలో తాజాగా నలుగురికి ఒమిక్రాన్

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 కరోనా కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూల్ లో 8 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇక ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే కొత్తగా నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది. అమెరికా నుంచి వచ్చిన ఒక్కరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికీ, మరో దేశం నుంచి వచ్చిన ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులలో ప్రకాశం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన వారు ఒక్కరు ఉన్నారు.

English summary
In Andhra Pradesh, 434 people have been diagnosed with corona positive in the last 24 hours, according to the medical health department. This brings the total number of Omicron cases registered in the AP to 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X