ఏపీలో కరోనా పంజా ... కరోనా కట్టడికి అక్కడ నేటి నుండి వారం రోజులపాటు లాక్ డౌన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఏపీలో కేసులు పెరుగుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరగడంతో అధికారులు కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్ డౌన్ ప్రకటించారు.

వారం రోజుల పాటు గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్ డౌన్
ఈరోజు నుంచి వారం రోజుల పాటు గుంటూరు జిల్లా భట్టిప్రోలు లో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. లాక్ డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసరాల కొరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు. వారం రోజుల తర్వాత కేసుల పరిస్థితిని సమీక్షించి లాక్ డౌన్ కొనసాగించాలా లేదా ఎత్తివేయాలా అన్న నిర్ణయం తీసుకుంటామని అధికార యంత్రాంగం చెబుతోంది.

భారీగా పెరిగిన కరోనా కేసులు ... బుధవారం ఒక్క రోజే 1184 మందికి కరోనా
ఏపీలో బుధవారం రోజు 1184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నలుగురు మృతి చెందారు. ఇక నిన్న నమోదైన మొత్తం కేసులలో అత్యధిక కేసులు గుంటూరు జిల్లాలోని నమోదయ్యాయి . నిన్న ఒక్కరోజే గుంటూరు జిల్లాలో 352 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిన్న రాష్ట్రంలో అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు పెరగటంతో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం కరోనా కట్టడికి నిర్ణయం తీసుకుంది .

రాష్ట్రంలో కేసులు పెరిగితే ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ విధింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం బుధవారం నాడు నమోదైన 1,184 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,01,989 కి చేరింది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా మరణాలతో ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7, 217 కు చేరుకుంది.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 456 మంది పూర్తిగా కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,338గా ఉంది. ఇదే విధంగా కేసులు పెరుగుతూ పోతే తీవ్రంగా ప్రభావం ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొంది .












Click it and Unblock the Notifications