ఏపీలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ ; తాజాగా 1186 కేసులు, 10 మరణాలు, ఆ జిల్లాలోనే కరోనా ఉధృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,186 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.

రికవరీల కంటే ఏపీలో కొత్త కేసులే ఎక్కువ
కరోనా మహమ్మారి నుండి నిన్న ఒక్కరోజే 1,396 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 14,473 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోలుకున్న 1,396 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 19,86,962గా ఉంది . ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,15,302 గా నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13,867 గా ఉంది.

Corona in AP: 1186 new cases, 10 deaths; highest cases in east godavari district !!

తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా తాజా కొత్త కేసులు
ఇక గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, ప్రకాశం , చిత్తూరు, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం పది మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో 175 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చిత్తూరు జిల్లాలో 171 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 156 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 125 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 111 కరోనా కేసులు, కృష్ణా జిల్లాలో 103 కరోనా కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా కేసులు నమోదైన కర్నూలు, విజయనగరం జిల్లాలు
ఆ తర్వాత స్థానాలలో వైఎస్ఆర్ కడప జిల్లాలో 87 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 73 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 69 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 50 కేసులు, అనంతపూర్ జిల్లాలో 40 కేసులు, కర్నూలు, విజయనగరం జిల్లాలో 13 కేసులు చొప్పున నమోదయ్యాయి. మరోపక్క సెప్టెంబరు అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా పరిస్థితిపై జరుగుతున్న సమీక్షలలో వెల్లడిస్తున్నారు.

అలెర్ట్ గా ఉండాల్సిన సమయం.. సీఎం జగన్ సూచన
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలను మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలంతా తప్పకుండా కరోనా ప్రోటోకాల్స్ పాటించాలని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి కరోనా సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. ఏది ఏమైనప్పటికీ దేశంలోలానే రాష్ట్రంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్న తీరు అలెర్ట్ గా ఉండాలన్న సందేశాన్ని ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+