Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా వ్యాప్తి టీడీపీ స్లీపర్ సెల్స్ వల్లే.. ఇది టీడీపీ కుట్రే : మంత్రి మోపిదేవి

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం కరోనా కంట్రోల్ లో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . కరోనా వ్యాప్తిపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల కుట్రల వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతుందని ఆయన ఎదురు దాడికి దిగారు .

పెరుగుతున్న కేసులు .. మాటల యుద్ధం చేస్తున్న టీడీపీ , వైసీపీ నేతలు

పెరుగుతున్న కేసులు .. మాటల యుద్ధం చేస్తున్న టీడీపీ , వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది . వైసీపీ నేతల పబ్లిసిటీ పిచ్చితో కరోనా కేసులు పెరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే ,కరోనా వ్యాప్తికి టీడీపీనే కారణమని టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు .

కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేనన్న మంత్రి

కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేనన్న మంత్రి


ఇక ఇప్పటి వరకు రాని కొత్త ప్రాంతాల్లో కూడా కరోనా వస్తుందంటే కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేనన్న అనుమానం వస్తోందని చెప్పారు. ఇక ఏపీ రాజ్ భవన్ లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటం పట్ల వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ఆయన స్పందించారు . రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించిన కనగరాజ్‌ తమిళనాడు నుండి వచ్చి గవర్నర్ బంగ్లాకు వెళ్లడంతోనే కరోనా వచ్చిందనే ఆరోపణలను మంత్రి మోపిదేవి తప్పుబట్టారు . ఇక కరోనా కష్ట కాలంలోనూ చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతారంటూ విమర్శలు గుప్పించారు.

రాజ్ భవన్ లో కరోనాపై టీడీపీ చిల్లర రాజకీయం

రాజ్ భవన్ లో కరోనాపై టీడీపీ చిల్లర రాజకీయం

ఏపీలో అత్యవసర పరిస్థితి ఉన్న సమయంలో కూడా టీడీపీ చిల్లర రాజకీయాలు మానుకోవటం లేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ ప్రమాణ స్వీకారాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని ఆయన మండిపాటుకు గురయ్యారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా కనగారాజ్ ప్రమాణ స్వీకారం వల్ల కరోనా పాజిటివ్ వచ్చిందని టీడీపీ ఆరోపించటం దారుణం అని ఇది చిల్లర రాజకీయం అంటూ మండిపడ్డారు.

 ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబు తిప్పలు అన్న మంత్రి మోపిదేవి

ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబు తిప్పలు అన్న మంత్రి మోపిదేవి

ఇక బీజేపీ కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌కు లేఖ రాయడం కూడా రాజకీయమేనని మోపిదేవి తప్పుబట్టారు. కిట్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అనవసరంగా కితల కొనుగోలు విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు . ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసమే ప్రయత్నాలు చేస్తుంటారని కరోనా వ్యాప్తికి టీడీపీ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయేమో అన్న అనుమానం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+