వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణాల్లో భిన్నమైన కరోనా వైరస్ ఎన్ 440కే .. సీసీఎంబీ శాస్త్రవేత్తల వెల్లడి

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా నుండి బయటపడడం కోసం ప్రపంచం మొత్తం యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండగా, కరోనా వైరస్ కూడా అంతే వేగంగా రూపాన్ని మార్చుకుంటూ విస్తరిస్తోంది. కరోనా వైరస్ లో వేగంగా కొత్త మార్పులు చోటు చేసుకొని కరోనా కొత్త రకాలు ఉద్భవిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి .

Recommended Video

#Coronavirus #N440k Different Type Found In AP & Telangana - CCMB Scientists

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల తో పాటు దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ ఉత్పరివర్తన కనిపిస్తోందని సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

 హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ భయం .. బ్రిటన్ నుండి వచ్చిన 15 మందికి పాజిటివ్ హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ భయం .. బ్రిటన్ నుండి వచ్చిన 15 మందికి పాజిటివ్

దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న కరోనా ఉత్పరివర్తన

దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న కరోనా ఉత్పరివర్తన

అయితే ఈ భిన్నమైన కరోనా వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదని కూడా వారు స్పష్టం చేశారు. దీనికి ఎన్ 440కే అని పేరు పెట్టినట్లుగా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ ఇప్పటికే వివిధ దేశాలలో వివిధ రకాలుగా ఉత్పరివర్తనలు జరిగింది. యూకే కొత్త స్ట్రెయిన్ , దక్షిణ ఆఫ్రికా కొత్త స్ట్రెయిన్ , బ్రెజిల్ కొత్త స్ట్రెయిన్ ఇలా భిన్న రకాలుగా ఉత్పరివర్తనలు జరుగుతూ కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అయితే ఇతర దేశాలలో వచ్చిన కొత్త రకాల కు, పాత కరోనా వైరస్ కంటే అధికంగా వ్యాప్తి చేసే శక్తి ఉంది. అవి పాత కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అని అధ్యయనాలు పేర్కొన్నాయి.

 ఇతర దేశాల్లో స్ట్రెయిన్ లు శక్తివంతం , ఇండియాలో మాత్రం బలహీనం

ఇతర దేశాల్లో స్ట్రెయిన్ లు శక్తివంతం , ఇండియాలో మాత్రం బలహీనం

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణ భారతదేశంలో కూడా కరోనా వైరస్ ఉత్పరివర్తన జరిగినట్లుగా సిసిఎంబి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇది ఇతర రకాల కన్నా ఒకింత బలహీనంగా ఉందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. దేశంలో ఈ రకం వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధారించడం కోసం పరిశోధనలు ముమ్మరం చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇది పూర్తిగా కొత్త రకం కాదని, కొద్దిపాటి మార్పులు కరోనా వైరస్ లో సంభవించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొంతకాలంగా వ్యాప్తిలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

కరోనా పాత వైరస్ బలహీనపడడంతో భిన్నమైన వైరస్ గా మార్పు

కరోనా పాత వైరస్ బలహీనపడడంతో భిన్నమైన వైరస్ గా మార్పు


గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలలలో కొద్దిపాటి కేసులలో కనిపించిందని. ఇప్పుడు ఎక్కువమందికి వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు .అంతేకాదు ఎన్ 440 కే రకం వల్ల ,కరోనా సోకిన వారికి స్వల్ప లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా పాత వైరస్ బలహీనపడడంతో ఇది ఉత్పన్నమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు . ప్రస్తుతానికి ఈ రకం పై పెద్దగా డేటా అందుబాటులో లేదని వారు చెబుతున్నారు.

మ్యూటేషన్ లతో భయం .. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చెయ్యాల్సిన అవసరం

మ్యూటేషన్ లతో భయం .. వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చెయ్యాల్సిన అవసరం

రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి తెస్తామని సిసిఎంబి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైనప్పటికీ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయకుంటే, కరోనా మహమ్మారి రకరకాలుగా ఉత్పరివర్తనలు జరిగి కొత్త రకాల పుట్టుకకు కారణం అవుతుంది అన్న సంకేతాలు తాజా మ్యూటేషన్ల ద్వారా అర్థమవుతుంది.
ప్రస్తుతానికి తెలంగాణా , ఏపీలలో కనిపిస్తున్న భిన్నమైన వైరస్ బలహీనమైనదని చెప్పటం ఊపిరితీసుకునే అంశం .

English summary
According to cellular and molecular biology scientists, corona virus mutations are seen in Andhra Pradesh, Telangana and South India. However, CCMB director Rakesh Mishra said it was a bit weaker than other types. He explained that research is in full swing to determine the level of spread of this type of virus in the country. Scientists say that this is not a completely new type and that minimal changes have occurred in the corona virus.Claimed to have been prevalent for some time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X