వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్‌పై అవగాహన: తెల్లని గుర్రంపై ఎర్రని మచ్చలు, అవేర్‌నెస్ కల్పించిన ఎస్సై..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌కు మందు లేకపోవడంతో.. నివారణ ఒక్కటే మార్గమని నేతలు, ప్రముఖులు సూచిస్తున్నారు. వీలైనంత మేరకు ఇంట్లో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎస్సై మారుతీ శంకర్ వైరస్ గురించి వినూత్నంగా అవగాహన కల్పించారు.

Recommended Video

Watch : A Policeman Is Spreading Awareness To The People In A Different Way In AP
కరోనాపై అవగాహన..

కరోనాపై అవగాహన..

ప్యాపిల్ ఎస్సై మారుతీ శంకర్.. కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకొన్నారు. సోమవారం తెల్లని గుర్రంపై ఎరుపు రంగులో కరోనా వైరస్ గుర్రులు వేయించారు. ఆ గుర్రంపై పట్టణంలో తిరుగుతూ కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని.. సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. వైరస్ వేగంగా ప్రబలుతోన్న జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎస్సై సందేశం

గుర్రంపై కూర్చొని ప్రజలకు కొన్ని సూచనలు చేశారు మారుతీ శంకర్. తర్వాత వారితో చప్పట్లు కూడా కొట్టించారు. ఇదివరకు విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు కూడా ఒక వీడియో విడుదల చేశారు. అందులో కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగహన కల్పించారు. పోలీసులు రూపొందించిన వీడియో సోషల్ మీడియోలో వైరలవుతోంది.

షేక్ హ్యాండ్ వద్దు

షేక్ హ్యాండ్ వద్దు

పార్వతీపురం సర్కిల్ పరిధిలోని ఎస్సై, కానిస్టేబుళ్లు మాస్కుల ధరించి సినిమా పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లయబద్దంగా డ్యాన్స్ చేశారు. కరచాలనం వద్దు.. నమస్కారం ముద్దు అని సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొవాలని.. మాస్కులు ధరించాలని సజెస్ట్ చేశారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు వీడియో రూపొందించామని సీఐ దాశరథి తెలిపారు. వీడియో రూపొందించిన పోలీసులను పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అభినందించారు. పలువురు కూడా విష్ చేశారు.

English summary
Pyabili si maruthi shankar ride on Horse in town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X