ఏపీలో 16 కొత్త పాజిటివ్ కేసులు, 381కి చేరిక: మాస్కులు ఇలా తయారు చేయండి(వీడియో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరింది. ఇప్పటి వరకు 6 మరణాలు సంభవించాయి.

శుక్రవారం నాడు నమోదైన కేసుల్లో గుంటూరు జిల్లాలో 7, తూర్పుగోదావరి జిల్లాలో 5, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున మొత్తం 16 ఉన్నాయి. 77 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

 coronavirus positive cases toll to 381 in andhra pradesh.

కాగా, 'రాష్ట్రం లో పాజిటివ్ నిర్దారించబడిన పేషెంట్స్ యొక్క నివాస స్థలాలు రెడ్ అలెర్ట్‌లో పెట్టబడ్డాయి. వారి యొక్క కాంటాక్ట్స్ అందర్నీ క్వారంటైన్ కి తరలించటం జరిగింది. పేషెంట్ నెం. 191 నుంచి 250 వరకు పాజిటివ్ వచ్చిన వాళ్ళ నివాస స్థలాలు కింద ఇవ్వటం జరిగింది' అని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ వేదికగా వెల్లడించడం జరిగింది.

'ఇంట్లో మాస్క్ తయారు చేసుకోవడానికి 7 దశల సులువైన మార్గం. మీరు కరోనా సోకిన వ్యక్తితో తక్షణ సంబంధంలో లేకుంటే ఇది ఆమోదయోగ్యమైనది. మీరే తయారు చెయ్యండి మాతో ఫోటోలు పంచుకోండి!' అనే మరో వీడియో ట్వీట్ చేసింది ఆరోగ్యాంధ్ర.

తెలంగాణలోనూ శుక్రవారం 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 487కుచేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. మరో 45 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 430 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+