ఏపీలో 2 గంటల్లో 24 కొత్త కేసులు.. దిగ్భ్రాంతికరంగా వైరస్ వ్యాప్తి.. జగన్ ప్రకటన తర్వాత ఇలా..
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన రోజు నుంచి కేసుల సంఖ్యలో చిట్టచివరన ఉన్న ఆంధ్రప్రదేశ్.. బుధవారం నాటికి టాప్-7వ రాష్ట్రంగా నిలిచింది. దేశంలోనే అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా గుర్తింపు పొందిన ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లోప్రార్థనలకు ఏపీ నుంచి వేల మంది హాజరయ్యారని వెల్లడికావడంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారే మారిపోయింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకొచ్చి వైరస్ పరిస్థితిపై వివరణ ఇచ్చారు. సీఎం ప్రకటన తర్వాత రెండు గంటల వ్యవధిలోనే కొత్తగా మరో 24 కేసులు పాజిటివ్ గా తేలడం భయాందోళనల్ని రెట్టింపు చేసింది.

సీఎం ఏం చెప్పారంటే..
సాయంత్రం ఏడు గంటల తర్వాత సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ నుంచి ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వారి సంఖ్య 1085గా నిర్ధారించామని, అందులో 21 మందిని తప్ప మిగతావాళ్లను ఐసోలేషన్ కు తరలించామని, మొత్తంగా అప్పటిదాకా 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 70 మంది ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లే కావడం గమనార్హమని సీఎం చెప్పారు. అయితే రాత్రి మరో బులిటెన్ విడుదైంది..

రెండు గంటల్లో ఇలా..
ఏపీలో 87 కేసులు నమోదయ్యాయన్న సీఎం చెప్పిన రెండు గంటల వ్యవధిలోనే, రాత్రి 10 గంటలకు కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మరో బులిటెన్ విడుదల చేశారు. అందులో కొత్తగా 24 కేసులు నమోదయ్యాయని, తద్వారా మొత్తం కేసుల సంఖ్య 111కు పెరిగిందని తెలిపారు. తద్అంవారా రెండు గంటల వ్యవధిలోనే 24 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్లయింది. కొత్త కేసులన్నీ మర్కజ్ కు సంబంధించినవేనని తెలుస్తున్నది.

తెలంగాణను తోసేసి..
మర్కజ్ ఉదంతం తర్వాత ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తున్నది. బుధవారా రాత్రి విడుదలైన బులిటెన్ లో రాష్ట్రంలో 111 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ సంఖ్య.. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఎక్కువ కావడం మరింత కలవరపెడుతున్నది. తెలంగాణలో ఇప్పటిదాకా 105 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 6గురు ప్రాణాలు కోల్పోగా.. ఏపీలో ఇప్పటిదాకా అలాంటి ఘటనలు జరగలేదు. దేశవ్యాప్త జాబితాలో ప్రస్తుతం ఏపీ కంటే పైన ఉత్తరప్రదేశ్(116 కేసులు), రాజస్థాన్(120), ఢిల్లీ(152), తమిళనాడు(234), కేరళ(265), మహారాష్ట్ర(335) ఉన్నాయి. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.
Recommended Video

ఒకే రోజు 67 కేసులు..
ఏపీలో బుధవారం ఒక్కరోజే ఒక్కరేజఒకే రోజు 67 కొత్త కేసులు నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మంగళ, బుధవారాల్లో కలిపి 88 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా బులిటెన్ తర్వాత ఆయా జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలివి..
అనంతపురం - 2
చిత్తూరు - 6
తూర్పుగోదావరి - 9
గుంటూరు - 20
కడప - 15
కృష్ణ - 15
కర్నూలు - 1
నెల్లూరు - 3
ప్రకాశం - 15
విశాఖపట్నం - 11
పశ్చిమగోదావరి - 14
మొత్తం 111












Click it and Unblock the Notifications