క్షణికావేశంతో దంపతుల ఆత్మహత్య: కానిస్టేబుల్ సైతం

రఘు వృత్తిరీత్యా వైద్యుడు. మండల కేంద్రంలోనే సంజీవిని వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. వీరికి 11 నెలల చిన్ని అనే కూతురు ఉంది. భార్యాభర్తలు ఇటీవల కొద్ది కాలంగా కుటుంబ విషయాల్లో గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో కల్పన పత్తిపంటకు వాడే మోనోక్రోటోఫాస్ తాగింది. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఆ ఘటనను చూసి ఆవేశంతో భర్త రఘు మిగిలిన మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ సంఘటనతో స్థానికంగా విషాద వాతావరణం చోటు చేసుకుంది.
తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తాగి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగానే అతను ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపుల వల్లనే ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
ఇదిలావుంటే, ప్రకాష్ వీర్ మంగళవారం భార్యకు ఫోన్ చేసి ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని, ఉద్యోగం చేయలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రకాష్ వీర్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications