పెంపుడు కుక్కకు విగ్రహం: ప్రతి ఏటా వర్ధంతి.. ఊరంతా భోజనాలు; ఎందుకంటే!!

మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్న, కనీస రక్త సంబంధాలకు విలువ ఇవ్వకుండా, కన్న బిడ్డలు సైతం తల్లిదండ్రులు పట్టించుకోకుండా పోతున్న నేటి తరుణంలో పెంపుడు కుక్క పై తన ప్రేమను వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు. తొమ్మిది సంవత్సరాల పాటు సొంత బిడ్డ లాగా ఎంతో ఆప్యాయంగా పెరిగిన కుక్క చనిపోతే, దానికి విగ్రహం పెట్టి, ఏకంగా పూజలు చేస్తూ, ప్రతి ఏడూ వర్ధంతి నిర్వహిస్తూ, ఊరంతా భోజనాలు పెడుతున్నారు.

పెంపుడు కుక్కను మర్చిపోలేం అంటున్న కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు

పెంపుడు కుక్కను మర్చిపోలేం అంటున్న కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు


విశ్వాసానికి మారుపేరు గా ఉన్న, బ్రతికినంత కాలం తనని కంటికి రెప్పలా కాచుకున్న కుక్కను మరిచిపోలేం అంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయంతో పాటు పశుపోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జ్ఞాన ప్రకాశ రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండటంతో, వారిద్దరికీ పెళ్లి చేయగా, ఇద్దరూ అత్తవారింటికి వెళ్లిపోయారు. ఇక ఆపై వారు తమకు తోడుగా ఒక శునకాన్ని పెంచుకున్నారు.

 ఇంట్లో కొడుకులా యజమానికి బాసటగా తిరిగిన శునకం మృతి

ఇంట్లో కొడుకులా యజమానికి బాసటగా తిరిగిన శునకం మృతి


జ్ఞాన ప్రకాశరావు ఏదైనా పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు అది అన్నపానీయాలు ముట్టకుండా ఆయన కోసం ఎదురు చూసేది. రాగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరకు వెళ్ళేది. ఇక వారిని ఎవరైనా ఏమైనా అంటే అసలే సహించేది కాదు. ప్రతిరోజు ప్రకాశరావు తో పాటు పొలానికి కూడా వెళ్ళేది. ఒక మనిషిలా అది ఆయనకు చేదోడు వాదోడుగా తిరిగేది. ఒక కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా అనుబంధాన్ని పెనవేసుకున్న ఆ పెంపుడు కుక్క అకస్మాత్తుగా మరణించింది.

 కుక్క విగ్రహం ఇంటిముందు ఏర్పాటు, ఏటా వర్ధంతి .. ఊరంతా భోజనాలు

కుక్క విగ్రహం ఇంటిముందు ఏర్పాటు, ఏటా వర్ధంతి .. ఊరంతా భోజనాలు


దీంతో ప్రకాశరావు కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కన్న బిడ్డ కంటే ఎక్కువగా మెదిలిన కుక్క చనిపోతే మనుషులకు శాస్త్రోక్తంగా కర్మకాండలు ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదేవిధంగా కు కూడా శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు ప్రకాశరావు. ఆ కుక్క కోసం వారు కంటికి కడివెడు రోదించారు. అంతే కాదు ప్రతి సంవత్సరం ఆ మూగ జీవానికి వర్ధంతి నిర్వహిస్తున్నారు. 5వ వర్ధంతి సందర్భంగా ఇంటి ముందే కుక్క విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంవత్సరికం నిర్వహిస్తూ బంధువులకు, గ్రామస్తులకు భోజనాలు పెట్టి కుక్క పట్ల తమకున్న ప్రేమను ప్రదర్శిస్తున్నారు

 మూగ జీవమైన కుక్క పట్ల దంపతుల ప్రేమకు హ్యాట్సాఫ్ చెప్తున్న పెట్ లవర్స్

మూగ జీవమైన కుక్క పట్ల దంపతుల ప్రేమకు హ్యాట్సాఫ్ చెప్తున్న పెట్ లవర్స్


ఎంతో ప్రేమగా పెంచిన బిడ్డలే తల్లిదండ్రులను పట్టించుకోకుండా దూరంగా ఉంటే, మూగ జీవం అయినప్పటికీ కుక్క యజమాని పై చూపించిన ప్రేమను వారు మరిచిపోలేకపోతున్నారు. ఇంటి ముందే కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని అనుక్షణం గుర్తు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక జ్ఞాన ప్రకాశరావు కు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమను పలువురు ప్రశంసిస్తున్నారు. మనుషులలో అయినా కల్మషం ఉంటుంది కానీ, జంతువుల లో ఎటువంటి కల్మషం ఉండదని, అటువంటి జంతువుల పై ప్రేమను చూపించటంలో తప్పు లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+