ఆరోగ్య సమస్యలు, కొడుకుకు దూరంగా, తల్లిదండ్రులు ఇలా చేశారు
కొడుకు సరిగా చూడకపోవడం, అనారోగ్య సమస్యలతో వృద్ద దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకొంది.
కడప:కొడుకు సరిగా చూడకపోవడం, అనారోగ్య సమస్యలతో వృద్ద దంపతులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకొంది.
కడప జిల్లా మైలవరం మండలంలోని రొమ్మరనంద్యాల గ్రామంలోని బంరకారవీధిలో తొండూరు సుబ్బమ్మ, , రామయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు, ఓ కొడుకు ఉన్నారు.అందరికీ వివాహలు చేశారు.

ఇటీవలనే కొడుకు తల్లిదండ్రులకు దూరంగా వేరే కాపురం పెట్టాడు.వృద్ద దంపతులు కూడ విడిగా ఉంటున్నారు. బీపీ, షుగర్ ఎక్కువై ఆనారోగ్యానికి గురయ్యారు వృద్ద దంపతులు. ఆసుపత్రికి వెళ్తే ప్రతి రోజూ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
అయితే ఆనారోగ్యసమస్యలతో పాటు కొడుకు తమను పట్టించుకోకపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.దీంతో వారిద్దరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications