విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిమబిందు హత్య, రేప్ కేసు: నిందితుడి బెయిల్ రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Court cancels accused bail in Himabindu murder case
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన హిమబిందుపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు నిందితుడి బెయిల్‌ను రద్దు చేసింది. ఈ కేసులో నాలుగో నిందితుడు జంపాల కృష్ణ బెయిల్‌ను రద్దు చేస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా లొంగిపోవాలని జంపాల కృష్ణకు ఆదేశాలు జారీ చేసింది.

హిమబిందు అనే మహిళపై నిందితులు ఈ ఏడాది మార్చిలో అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. హిమబిందుపై కొన్నాళ్లుగా డ్రైవర్లుగా పని చేసిన సుభానీ, గోపీకృష్ణలు కన్నేశారని, ప్లాన్ ప్రకారం ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారని పోలీసులు అప్పట్లో చెప్పారు. ఆరుగురు కలిసి హిమబిందుపై అత్యాచారం చేసి హత్య చేశారని డిసిపి రవి ప్రకాశ్ మీడియా సమావేశంలో చెప్పారు. సుభానీ, గోపీకృష్ణలు హిమబిందు కుటుంబ సభ్యులకు డ్రైవర్లుగా పని చేశారన్నారు. ఆమెపై చాలాకాలంగా సుభాని కన్నేశాడని, గోపీకృష్ణతో కలిసి ప్లాన్ వేశారని చెప్పారు.

తామిద్దరం మాత్రమే వెళ్తే ప్రతిఘటన ఎదురవుతుందని భావించారని, దీంతో గోపీకృష్ణ ముగ్గురిని, సుభానీ ఓ వ్యక్తిని వెంట తీసుకు వచ్చారన్నారు. హత్య చేసిన రోజు నిందితులు అపార్టుమెంటులోని కింది వాళ్లకు నీళ్లు రావడం లేదని, చెక్ చేయడం కోసం వచ్చారని చెప్పారు. వారి మాటలను నమ్మిన హిమబిందు తలుపు తీయడంతో, వారు ఓ ఐదు నిమిషాల పాటు బాత్రూంలో రిపేర్ చేస్తున్నట్లు నటించారన్నారు. ఆమె బెడ్రూంలో పని చేసేందుకు వెళ్లగా, సుభాని, గోపీకృష్ణలు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారన్నారు.

మొదట ముగ్గురు, ఆ తర్వాత ఒకరు బయట కాపలా ఉంటూ ఇంకొకరు, మొత్తం ఆరుగురు అత్యాచారం చేశారన్నారు. ఆ తర్వాత గొంతు పిసికి హత్య చేశారని, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారన్నారు.

English summary
Court has cancelled bail of an accused in Himabindu murder case in Krishna district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X