జగన్: ఇడుపులపాయకు కోర్టు ఓకే, గుంటూరుకు నో

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు వెళ్లేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక కోర్టు సోమవారం అనుమతించింది. గుంటూరుకు వెళ్లేందుకు మాత్రం అనుమతి నిరాకరించింది.

నిరుడు మే 27న ఆస్తుల కేసులో అరెస్టైన వైయస్ జగన్ వారం రోజుల క్రితం జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తన స్వగ్రామం ఇడుపులపాయ వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

YS Jagan

తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు జగన్‌కు షరతు ఉన్న నేపథ్యంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు వెళ్లడానికి అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.

ఆయన పిటిషన్ పైన సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతు నుంచి జగన్‌కు మినహాయింపు ఇవ్వరాదని కౌంటర్‌లో పేర్కొన్నారు. ఆయన నగరాన్ని విడిచి వెళితే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సిబిఐ పిటిషన్‌లో పేర్కొంది.

గవర్నర్‌ను కలవనున్న జగన్

వైయస్ జగన్ సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. అసెంబ్లీని సమావేశపర్చి సమైక్యాంధ్ర కోసం తీర్మానం పెట్టాలని ఆయన వినతి పత్రం ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+