వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌పై కేసుకు కోర్టు ఆదేశం, కొట్టుకున్న 'టీ' కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు పోలీసులను సోమవారం ఆదేశించింది. ఈ నెల 6వ తేదీ లోగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావుల పైన రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది గోవర్ధన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని ఆధారంగా కోర్టు పైవిధంగా స్పందించింది.

దుబ్బాక కాంగ్రెసు సమావేశం రసాభాస

Court orders to book case against Revanth Reddy

దుబ్బాక కాంగ్రెసు పార్టీ నేతల సమావేశం రసాభాస అయింది. పార్టీ సీనియర్ నేతలు డీ శ్రీనివాస్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీనియర్ నేతల ఫోటోలు లేవంటూ ముత్యం రెడ్డి, ఫారూక్ హుస్సేన్ వర్గీయులు కొట్టుకున్నారు.

ట్యాంక్‌బండ్ విగ్రహాలపై శంకర రావు

ట్యాంక్‌బండ్ పైన ఉన్న విగ్రహాలు తెలుగువారివే తప్ప ఆంధ్రులవి కాదని మాజీ మంత్రి శంకర రావు వేరుగా అన్నారు. ట్యాంకుబండ్ పైన ఉన్న ఆంధ్రా విగ్రహాలను కూలగొడతాని చెప్పడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న కొందరు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా ఎన్టీఆర్ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. ట్యాంక్‌బండ్ పైన ఉన్న ఆంధ్రావారి విగ్రహాలను కూలగొడతామన్న తెలంగాణ మంత్రి నాయిని వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

English summary
Nampally Court on Monday ordered Banjara Hills police to bo\ok case against Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X